Prashanth Varma: ప్రశాంత్ వర్మ తో చిరంజీవి సినిమా ఎప్పుడో తెలుసా..?

చిరంజీవిని కూడా ఒక మైథాలాజికల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడా? లేదా ఆయనతో ఒక మాస్ మసాలా సినిమా చేస్తాడా? లేదా గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ తో ఉన్న సినిమా చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.

Written By: Gopi, Updated On : February 3, 2024 9:13 am
Follow us on

Prashanth Varma: హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా వస్తుంది. అయితే జై హనుమాన్ సినిమాలో హనుమంతుడు చేసే ఒక గొప్ప పని మీద ఈ సినిమా స్టోరీ ఉండబోతున్నట్టుగా మొదటి పార్ట్ లోనే మనకు ఒక హింట్ ఇచ్చారు.

ఇక ఇదిలా ఉంటే ఈయన నెక్స్ట్ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి వీళ్ళిద్దరి కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుంది అని ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్లో విపరీతమైన ప్రశ్నలైతే వస్తున్నాయి. అయితే ఆ సినిమా ఇప్పుడప్పుడే వచ్చే సూచనలైతే కనిపించడం లేదు. ఎందుకంటే ఒక వన్ ఇయర్ వరకు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాని తెరకెక్కిస్తాడు. అలాగే చిరంజీవి విశ్వంభర సినిమాతో పాటు రీసెంట్ గా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఆ సినిమాని పూర్తి చేసే పనిలో ఉంటాడు.

కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలంటే దాదాపు ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల సమయం అయితే పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటే వీళ్ళ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తే బాగుంటుంది అంటూ జనాల్లో ఉన్న ఆలోచనే ప్రశాంత్ వర్మ కి కలిగి తను కూడా ఈ సినిమా కోసం ఒక స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మామూలు చిన్న హీరోలనే స్టార్లుగా చూపిస్తున్న ప్రశాంత్ వర్మ చిరంజీవిని ఏ రేంజ్ లో చూపిస్తాడు అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

అయితే చిరంజీవిని కూడా ఒక మైథాలాజికల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడా? లేదా ఆయనతో ఒక మాస్ మసాలా సినిమా చేస్తాడా? లేదా గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ తో ఉన్న సినిమా చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ సాధించిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా తో మరో భారీ సక్సెస్ సాధిస్తాను అంటూ చెప్తున్నాడు. ఇక 2025 సంక్రాంతి కానుకగా జై హనుమాన్ సినిమాను తీసుకువస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమా కూడా హనుమాన్ మూవీ లానే సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది…