https://oktelugu.com/

Tamil Heroes : తమిళ్ హీరోలకు పాన్ ఇండియా మార్కెట్ కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటే..?

ఒకప్పుడు మనదేశంలో బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ పొజిషన్ లో కొనసాగేది. ఎలాంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా అయిన కూడా అది బాలీవుడ్ నుంచి రావాల్సిందే అనేంతలా ప్రేక్షకుల్లో ఒక చెరగని ముద్రను వేసుకుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 4, 2024 / 02:21 PM IST
    Follow us on

    Tamil Heroes  : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీ నటులు చాలామంది ఉన్నారు. అయితే సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచే ఎక్కువ మంది హీరోలు మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక పాన్ ఇండియా లో మన హీరోలే ఎక్కువగా ఉండడం విశేషం..తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నప్పటికీ వాళ్లకి అంత మంచి గుర్తింపు అయితే రావడం లేదు. ఇక సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో తెలుగు సినిమాలు మాత్రమే భారీ సక్సెస్ ని అందుకోవడం తో బాలీవుడ్ జనాలకి కూడా తెలుగు సినిమాలను చూడటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఇక్కడి నుంచి ఏ చిన్న సినిమా పాన్ ఇండియా రేంజ్ లో వచ్చినా కూడా బాలీవుడ్ జనాలు వాటిని ఆదరిస్తూ సూపర్ సక్సెస్ చేస్తున్నారు. ఇక పాన్ ఇండియాలో తమిళ్ హీరోలు సక్సెస్ అవ్వక పోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాలు తమిళ్ నేటివిటికి దగ్గరగా ఉండడమే దాని కారణం గా తెలుస్తుంది.

    అలాగే బాలీవుడ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగా వాళ్ళ కథలు ఉండటం లేదు అనేది మాత్రం వాస్తవమనే చెప్పాలి. బాలీవుడ్ జనాలు తెలుగు సినిమా లను చూడటానికి బాగా అలవాటు పడ్డారు. నిజానికి మనవాళ్ళు చేసే సినిమాల్లోని విజువల్స్ గాని, కథలు గాని బాలీవుడ్ జనాలని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అందుకే మన సినిమాలు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా పెను ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాయి.

    ఇక రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ పైన కన్నేసి చాలా సినిమాలను చేసినప్పటికీ వాళ్లకు కూడా అక్కడ చేదు అనుభవమైతే ఎదురైందనే చెప్పాలి. ఇక ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ నుంచి మరి కొంత మంది స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు. ఇక వాళ్లలో సూర్య, విక్రమ్ ఇద్దరు కూడా పాన్ ఇండియా సినిమాలతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఇక విక్రమ్ చేసిన ‘తంగలాన్’ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా, సూర్య చేసిన ‘కంగువ ‘ సినిమా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. మరి ఈ రెండు సినిమాలతో అయిన తమిళ్ హీరోలకు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడుతుందా? వాళ్ళు స్టార్ హీరోలుగా అక్కడ సక్సెస్ లను సాధిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది…

    ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పోల్చుకుంటే తమిళ్ ఇండస్ట్రీ బాలీవుడ్ లో అంత ప్రభావాన్ని చూపించడం లేదనేది మనందరికీ తెలిసిందే… ఇక ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ కి ఉన్న క్రేజ్ మరే ఇతర ఇండస్ట్రీ లకి లేదన్నది వాస్తవం. ఇప్పుడు కనక మన హీరోలు వరుస సినిమాలతో సక్సెస్ లను సాధించినట్లైతే ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నే నెంబర్ వన్ కొనసాగుతుందనేది వాస్తవం… దానికి అనుగుణంగానే మన దర్శకులు, హీరోలు చాలా వరకు హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది… చూడాలి ఇక మీదట రాబోయే సినిమాలతో మన హీరోలు ఎలాంటి ప్రభంజనాలను సృష్టిస్తారు అనేది…