Douglas Emhof : నాకూ వివాహేతర సంబంధం… కమలా హ్యారీస్‌ భర్త సంచలన ప్రకటన..

అగ్రరాజ్యం అమెరికాలో వివాహేతర సంబంధాలు సర్వ సాధారణం. అక్కడ పెళ్లిళ్లకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. సహజీవనం కామన్‌. ఇక మొన్నటి వరకు గర్భధారణ కూడా కామన్‌ అయింది. కానీ, బైడెన్‌ వచ్చాక ఆంక్షలు విధించారు.

Written By: Raj Shekar, Updated On : August 4, 2024 2:36 pm
Follow us on

Douglas Emhof : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మూడు నెలలే సమయం ఉంది. బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్షుడు బైడెన్‌ తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ పోటీలో నిలిచారు. ఇక రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ చేస్తున్నారు. ఇప్పటిఏ ఎన్నికల ప్రచారం మొదులు పెట్టారు. ఇప్పటికే ట్రంప్‌ దూకుడు పెంచారు. అభ్యర్థి మార్పు నేపథ్యంలో డెమొక్రటిక్‌ పార్టీ ప్రచారంలో కాస్త వెనుకబడింది. ఇదిలా ఉంటే., అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థుల గురించిన విషయాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి అనేక విషయాలు అమెరికన్లకు తెలుసు. ఇక ఇండో ఆఫ్రికన్‌ సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ కూడా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు ఆమెకు పిల్లలు లేరు. దీనిని కూడా రిపబ్లికన్‌ పార్టీలో ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కమలా హ్యారిస్‌ భర్త తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు వివాహేతర సంబంధం ఉండేదని ప్రకటించారు. అమెరికాలో ఇది కొత్త కాకపోయినా అధ్యక్ష అభ్యర్థి భర్త కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మొదటి వివాహ సమయంలోనే..
అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌ భర్త డగ్లస్‌ ఎంహోఫ్‌ తనకు గతంలో వివాహేతర సంబంధం ఉన్నట్లు అంగీకరించారు. తన మొదటి వివాహ సమయంలో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో తాను తన మొదటి భార్యను మోసగించినట్లు తెలిపారు. తన మొదటి వివాహం తర్వాత తన చర్యలతోనే తనతోపాటు కెరిస్టిన్‌ చాలా కఠిన సమయాన్ని ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. దీనికి తానే బాధ్యత వహించానని చెప్పారు. ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని, ఆమె తన పిల్లలు చదివే పాఠశాలలో పనిచేసేదని ఈ కారణంతోనే ఆయన మొదటి భార్య విడిపోయిందని ఓ బ్రిటిష్‌ మీడియా పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలోనే ఆయన స్పందించారు. ఆ మహిళ ప్రెగ్నెంట్‌ అయిందని, అయితే గర్భాన్ని ఉంచుకోలేదని బ్రిటిష్‌ మీడియా తెలిపింది. అప్పటికే కెరిస్టిన్‌ను ఎమ్‌హోఫ్‌ పెళ్లి చేసుకున్నారని, వారికి ఇద్దరు సంతానం ఉన్నారని వెల్లడించింది.

2014లో కమలాహ్యారిస్‌తో వివాహం..
ఇదిలా ఉంటే.. కమలా హ్యారిస్‌ను హెమ్‌హోఫ్‌ 2014లో పెళ్లి చేసుకున్నారు. కమలా హ్యారిస్‌కు ఇది మొదటి వివాహం కాగా, హెమ్‌హోఫ్‌కు రెండోది. అతడి వివాహేతర సంబంధం గురించి హ్యారిస్‌కు ముందే తెలుసని సీఎన్‌ఎన్‌ పేర్కొంది. ఇదిలా ఉంటే.. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా కమలా ఖరారయ్యారు. రిపబ్లికన్‌ పార్టీ అబ్యర్థిగా ట్రంప్‌ పోటీ చేఐస్తున్నారు. వీరి మధ్య తొలి డిబేట్‌ సెప్టెంబర్‌ 4న జరిగే అవకాశం ఉంది.