Koratala Shiava : సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమా హిట్ అయింది అంటే దానికి దర్శకుడే కారణం.. అలాగే ఒక సినిమా ఫ్లాప్ అయింది అన్న కూడా దానికి దర్శకుడి ని ఉద్దేశిస్తూ ఆయన మీద భారీగా విమర్శలైతే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోల అభిమానులు మాత్రం సక్సెస్ ఇచ్చిన దర్శకులను తల మీద పెట్టుకుంటే తమ అభిమాన హీరోకి ఫెయిల్యూర్స్ ఇచ్చిన దర్శకులను మాత్రం విమర్శలు చేస్తూ వాళ్లకు సినిమాలు తీయడం చేతకాదు అనే రేంజ్ లో వాళ్ల మీద ఘాటు విమర్శలు అయితే చేస్తూ ఉంటారు. మరి మొత్తానికైతే ఇప్పుడు సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న ‘దేవర ‘ సినిమా దర్శకుడు అయిన కొరటాల శివ మీద ఇప్పటినుంచే నెగెటివిటీ అనేది బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా దేవర సినిమా ట్రైలర్ ని సినిమా ట్రైలర్ తో పోలుస్తూ చాలా వరకు కొరటాల శివ మీద విమర్శలు అయితే చేస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఇంతకుముందు ఆయన చేసిన ఆచార్య సినిమాలో పాద ఘట్టం అనే ఎపిసోడ్ తో ఆచార్య సినిమాని భారీ డిజాస్టర్ గా మలిచాడు. మరి ఇలాంటి క్రమంలో దేవర సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉండబోతుందా అంటూ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు సైతం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా కొరటాల శివ ను ట్రోల్ చేస్తున్నారు.
మరి ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని అందుకుంటాడని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంటే మరి కొంతమంది మాత్రం ఈ సినిమా కూడా డిజాస్టర్ అవ్వబోతుంది అంటూ అటు ఎన్టీఆర్ ని, ఇటు కొరటాలను డీ గ్రేడ్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దేవర సినిమా నుంచి వచ్చిన గాని సాంగ్స్ గాని, ట్రైలర్ గానీ ప్రేక్షకులను ఏమాత్రం అలరించకపోవడంతో ఇలాంటి విమర్శలైతే వస్తున్నాయి.
మరి కొరటాల శివ ఈ సినిమా మీద మాత్రం భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా మీదనే ఫోకస్ చేసి ఆయన ఈ సినిమాలోని ప్రతి షాట్ ని చెక్కుతూ వచ్చాడు. మరి ఇలాంటి క్రమంలోనే కొరటాల శివ మీద ఇలా నెగటివ్ కామెంట్స్ రావడం పట్ల అతని అభిమానులు కొంతవరకు నిరాశని వ్యక్తం చేస్తున్నారు.
అయినప్పటికీ కొరటాల మాత్రం ఇప్పుడు దేవర సినిమాను సక్సెస్ గా నిలపాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ ఈ సినిమా కనక మంచి సక్సెస్ ని సాధిస్తే తన మీద విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికి ఇదొక గుణపాఠంగా మారుతుందనే చెప్పాలి. ఒకవేళ ఈ సినిమాతో ఫెయిల్యూర్ ను కనక మూట గట్టుకుంటే మాత్రం ఆ విమర్శలకు ఇంకా బలం చేకూర్చే అవకాశం అయితే ఉంది.