Koratala Shiva-Anirudh : ప్రస్తుతం కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో దేవర అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన రిలీజ్ అవుతున్న నేపధ్యం లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ వచ్చి ప్రేక్షకులను కొంత వరకు అలరిస్తుంది. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ప్రేక్షకుల్ని ఏమాత్రం ఇంప్రెస్ చేయకపోగా, ట్రైలర్లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులకు అంత బాగా నచ్చలేదు. మరి దానికి కారణం ఏంటి అనే విషయాలను తెలుసుకుంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ వరుసగా తమిళ్, తెలుగు సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఆయనకు ఏమాత్రం ఖాళీ సమయం లేకపోవడంతో తనకు నచ్చిన ట్యూన్స్ ను కొడుతూ ముందుకు సాగుతున్నడంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా మ్యూజిక్ విషయంలో కొరటాల శివ కి, అనిరుద్ కి మధ్య విభేదాలు అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక కొరటాల తనకు నచ్చకపోయినా కూడా కొన్ని సాంగ్స్ ను, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని తీసుకొని సినిమాలో పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక కొరటాల తనకు బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వాలంటూ అనిరుధ్ ని అడిగినప్పటికీ అనిరుధ్ మాత్రం ఆ విషయంలో అంత పెద్దగా స్పందించకపోవడంతో కొరటాల శివ అనిరుధ్ మీద కొంతవరకు సీరియస్ అయినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి మొత్తానికైతే వరుసగా తన నాలుగు సినిమాలకు దేవిశ్రీప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్న కొరటాల శివ ఈ సినిమాకి మాత్రం అనిరుధ్ ను పెట్టుకోవడం పట్ల చాలావరకు బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకి కూడా దేవి శ్రీ ప్రసాద్ ఉంటే తనకు నచ్చిన మ్యూజిక్ ని ఇచ్చేవాడు అంటూ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి అనిరుధ్ తమిళ్ సినిమాలకు తప్ప తెలుగు సినిమాలకి అంత మంచి మ్యూజిక్ అయితే ఇవ్వలేకపోతున్నాడు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ చేస్తున్న అనిరుధ్ తెలుగులో ఇక మీదట వేరే సినిమాలకి అవకాశాలను అందుకోవడం చాలా కష్టమనే చెప్పాలి.
ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ కొరటాల ఇద్దరు కలిసి అనిరుధ్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం తను నిలబెట్టలేకపోతున్నాడనేది వాస్తవం…మరి ఈ సినిమా సక్సెస్ అయితే అనిరుధ్ కి ఎంతో కొంత పేరొస్తుంది. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మాత్రం అనిరుధ్ మీద భారీ వేటు పడబోతున్నట్టుగా తెలుస్తోంది.