https://oktelugu.com/

Jana Gana Mana: పూరి, విజయ్ లా జనగణమన ఆగిపోవడానికి కారణం ఏంటంటే..?

అప్పుడు ఆయన వర్క్ చాలా ఫాస్ట్ గా ఉండేది, హీరో లను కూడా చాలా ఈజీగా డీల్ చేస్తూ తొందరగా షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసేవాడు.ఇక ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో మూవీ ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ చెప్పి కరెక్ట్ గా అదే రోజుకు రిలీజ్ చేయగల టాలెంట్ ఉన్న దర్శకుడు.

Written By: , Updated On : January 27, 2024 / 10:48 AM IST
Jana Gana Mana
Follow us on

Jana Gana Mana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి ఒకప్పుడు స్టార్ హీరోలు సైతం ఆయన వెంటపడేవారు. మూడు నెలల్లోనే సినిమా తీసి ఎలాంటి స్టార్ హీరో కైనా సూపర్ సక్సెస్ లు ఇవ్వడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇలాంటి క్రమంలో గత కొద్ది సంవత్సరాల నుంచి పూరి జగన్నాథ్ చాలా వరకు డీలా పడ్డాడనే చెప్పాలి.

అప్పుడు ఆయన వర్క్ చాలా ఫాస్ట్ గా ఉండేది, హీరో లను కూడా చాలా ఈజీగా డీల్ చేస్తూ తొందరగా షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసేవాడు.ఇక ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో మూవీ ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ చెప్పి కరెక్ట్ గా అదే రోజుకు రిలీజ్ చేయగల టాలెంట్ ఉన్న దర్శకుడు.ఇక రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్న పూరి జగన్నాథ్ గత సంవత్సరం విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా మాత్రం భారీగా నిరాశపరిచింది.

దాంతో పూరి జగన్నాథ్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాడు.అయితే లైగర్ మూవీ రిలీజ్ కి ముందే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో జనగణమన అనే సినిమా అనౌన్స్ అయింది. అలాగే ఒక షెడ్యూల్ షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇక లైగర్ రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వడం తో విజయ్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దాంతో అప్పటి నుంచి పూరి జగన్నాథ్ కి విజయ్ దేవరకొండ కి మధ్య మాటలు లేవనే వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అయితే జనగణమన ప్రాజెక్టు పట్టాలెక్కుంటే పూరి జగన్నాథ్ ఇప్పటికే ఆ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేసేవాడు కానీ లైగర్ ప్లాప్ తో విజయ్ కి పూరి జగన్నాథ్ మీద నమ్మకం పోయిందని, అందువల్లే ఆ సినిమాని పట్టలెక్కించకుండా మధ్యలోనే వదిలేశారనే న్యూస్ అప్పట్లో బాగా స్ప్రెడ్ అయింది. మరి ఇప్పుడు పూరికి, విజయ్ కి మధ్య మాటలు లేవని వస్తున్న వార్తల్లో నిజముందా లేదా అనేది తెలీదు గానీ తొందరలోనే పూరి డబల్ ఇస్మార్ట్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతారంటూ పూరి జగన్నాథ్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ అయితే చేస్తున్నారు…