https://oktelugu.com/

Puri Jagannadh: పూరి జగన్నాధ్ తన సినిమాల్లో స్పీడ్ తగ్గించడానికి కారణం ఏంటి..?

Puri Jagannadh: నిజానికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో 75 రోజుల్లోనే 'బిజినెస్ మేన్' సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేశాడంటే పూరి జగన్నాథ్ కి ఉన్న ఘట్స్ ఎలాంటివో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమా ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ ని కూడా చెప్పేస్తాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 11, 2024 / 03:18 PM IST

    What is the reason for Puri Jagannadh doing movies very slow

    Follow us on

    Puri Jagannadh: ఒకప్పుడు సీనియర్ దర్శకులందరూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక సినిమాను లైన్ లో పెట్టి ఆ సినిమాను కూడా సెట్స్ మీదకి తీసుకువచ్చేవారు. దాసరి నారాయణరావు లాంటి దర్శకుడు మాత్రం ఒకేసారి నాలుగు నుంచి ఐదు సినిమాలను సెట్స్ మీద ఉంచి డైరెక్షన్ చేస్తూనే ముందుకు సాగేవాడు. ఇక ఇలాంటి క్రమంలో ఆయనకు చాలావరకు సక్సెస్ లు కూడా వచ్చాయి. ఆయన ఒకేసారి ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలతో సైతం సినిమాలను చేస్తూ ముందుకు తీసుకెళ్లేవాడు.

    ఇక ఆ జనరేషన్ తర్వాత వచ్చిన వాళ్ళలో పూరీ జగన్నాథ్ చాలా తక్కువ రోజుల్లో సినిమాను చేస్తూ తన స్టామినా ఏంటో చూపించుకొని స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. నిజానికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో 75 రోజుల్లోనే ‘బిజినెస్ మేన్’ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేశాడంటే పూరి జగన్నాథ్ కి ఉన్న ఘట్స్ ఎలాంటివో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమా ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ ని కూడా చెప్పేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో దర్శకులు చేస్తున్న సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయో ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా క్లారిటీ లేని సమయంలో ఆయన సినిమా ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఆయన అంత తక్కువ రోజుల్లో తీసిన కూడా అవుట్ పుట్ అనేది చాలా బాగా వచ్చేది. అందువల్లే పూరి జగన్నాథ్ ఇన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ గత కొన్ని రోజులుగా అసలు సినిమాల్లో వేగం అనేది చూపించడం లేదు. చాలా స్లోగా సినిమాలను చేస్తున్నాడు. అందరి దర్శకులు మాదిరిగానే తను కూడా చాలా లేజీగా సినిమాలను చేస్తున్నాడా? అనే అనుమానాలు తన అభిమానుల్లో కలుగుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎందుకు ఇంత స్లోగా సినిమాలను చేస్తున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక ఇదిలా ఉంటే లైగర్ సినిమా షూట్ స్టార్ట్ చేసినప్పుడు అనుకోకుండా కరోనా రావడంతో ఆ సినిమాని దాదాపు 5 నుంచి 6 నెలల వరకు పోస్ట్ పోన్ చేశారు. దానివల్ల ఆ సినిమా రిలీజ్ అనేది లేట్ అయింది. ఇక దాంతో పాటుగా ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇక ఆ తర్వాత ఒక మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో పూరి కొంచెం గ్యాప్ ఇచ్చి డబుల్ ఇస్మార్ట్ స్టోరీ ని రెడీ చేసి రామ్ హీరోగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

    అలాగే ఈ సినిమాని ఆచితూచి ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి తరుణంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా ఇప్పుడు పూరి అభిమానుల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక నిజానికి పూరి అభిమానులందరూ ఆయన మరోసారి బౌన్స్ బ్యాక్ అయితే చూడాలని కోరుకుంటున్నారు. మరి ఆయన కూడా అదే ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది అందుకోసమే ఒక సినిమా మీద ఆయనకు ఇష్టం లేకపోయిన ఇన్ని రోజులు పాటు సమయాన్ని కేటాయిస్తూ ఆ సినిమాని చెక్కుతున్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాతో పూరి పక్కగా హిట్టు కొట్టబోతున్నాడని…ఇక ఈ సినిమాతో రామ్ కూడా తనకి ఒక భారీ సక్సెస్ దక్కుతుందని భావిస్తున్నాడు… మరి ఇలాంటి సందర్భంలో పూరి తను అనుకున్న సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే ఆగస్టు 15వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…