https://oktelugu.com/

Rana: లీడర్ 2 లో కూడా రానా నే హీరోగా పెట్టడానికి గల కారణం ఏంటంటే..?

ధనుష్, నాగార్జున లను హీరోలుగా పెట్టి ' కుబేర ' అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే లీడర్ 2 సినిమాని కూడా తెరకెక్కించే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 19, 2024 / 03:27 PM IST

    What is the reason for making Rana a hero in Leader 2

    Follow us on

    Rana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిద్యభరితమైన కథలతో సినిమాలను తీయడంలో చాలా మంచి పేరు ఉన్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈయన చాలా డీసెంట్ గా సింపుల్ గా ఉండే కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ సక్సెస్ లు సాధిస్తాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా డిఫరెంట్ కంటెంట్ తో అయితే ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఈయన ధనుష్, నాగార్జున లను హీరోలుగా పెట్టి ‘ కుబేర ‘ అనే సినిమా చేస్తున్నాడు.

    అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే లీడర్ 2 సినిమాని కూడా తెరకెక్కించే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక లీడర్ సినిమాలో హీరోగా చేసిన రానా నే ఈ సీక్వెల్ లో కూడా హీరోగా పెట్టనున్నట్టుగా శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఇక ఈ సీక్వెల్ కి కూడా రానాని హీరోగా తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఇంతకుముందు రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో ఒక కాన్నింగ్ సీఎం గా నటించి మెప్పించాడు. ఇక దానికి పూర్తి ఆపోజిట్ లో ఉండే ఈ క్యారెక్టర్ లో కూడా తనైతేనే బాగా చేయగలడనే ఒకే ఒక ఉద్దేశ్యం తో రానాని తీసుకున్నానని శేఖర్ కమ్ముల క్లారిటీ ఇచ్చాడు.

    ఇక మొత్తానికైతే రానా ఈ సినిమాతో మరొక బ్లాక్ బాస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే రానా తేజ డైరెక్షన్ లో ‘రాక్షస రాజా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ 50% షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సంవత్సరం ఎండింగ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు చేస్తున్న కుబేర సినిమా తర్వాత లీడర్ 2 సినిమాని పట్టాలెక్కించే పనిలో శేఖర్ కమ్ముల ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే లీడర్ 2 సినిమాతో ఒక గొప్ప అంశాన్ని ప్రేక్షకులకు తెలియజేసే విధంగా శేఖర్ కమ్ముల ఈ సినిమాని మలుస్తాడని ప్రేక్షకులకు అయితే ఒక హామీ ఇచ్చాడు. ఈసారి ఈ సినిమాలో ఒక ప్రాబ్లం రేజ్ చేయడమే కాకుండా ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ని కూడా ఇచ్చే విధంగా కాన్సెప్ట్ డిజైన్ చేశానని తను చెప్పాడు. ఇక ఆయన చెప్పిన మాటలతో ఈ సినిమా మీద ఒక్కసారిగా ప్రేక్షకులకు అంచనాలైతే విపరీతంగా పెరిగిపోతున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది…