Chennai Super Kings: చెన్నై జట్టు.. సామాజిక స్పృహ అదిరేటట్టు.. నెట్టింట చెక్కర్లు కొడుతున్న ఫ్లెక్సీ

పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని సామాజిక బాధ్యతగా చెన్నై సూపర్ కింగ్స్.. సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ లో భాగంగా శుక్రవారం రాత్రి ఆ జట్టు లక్నో వేదికగా లక్నో జట్టుతో తలపడనుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 19, 2024 3:30 pm

Chennai Super Kings

Follow us on

Chennai Super Kings: దేశంలో తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 21 రాష్ట్రాలలో 102 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించి.. జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు.. ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన బ్రహ్మాండమైన హక్కు. దీనిని వజ్రాయుధం అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే మనల్ని ఐదు సంవత్సరాల పాటు ఎవరు పాలించాలో ఎన్నుకునే హక్కు మన చేతుల్లోనే ఉంటుంది. ఓటు ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఏడు దశల్లో నిర్వహించే ఎన్నికల్లో 969 మిలియన్ నమోదిత ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 44 రోజుల వ్యవధిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. 5.5 మిలియన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఇందుకు వినియోగిస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని సామాజిక బాధ్యతగా చెన్నై సూపర్ కింగ్స్.. సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ లో భాగంగా శుక్రవారం రాత్రి ఆ జట్టు లక్నో వేదికగా లక్నో జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తొలిదశ పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని.. vote by the morning.. whistle by the evening అనే నినాదంతో లక్నో నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. తొలి దశ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సహరాన్పూర్, కైరానా, ముజఫర్ నగర్, బిజ్నూర్, నగీనా, మొరీదాబాద్, రాంపూర్, ఫిలిఫిత్ పార్లమెంటు స్థానాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి లక్నో రాజధానిగా ఉంది. ఆ లక్నో వేదికగా చెన్నై జట్టు శుక్రవారం రాత్రి లక్నో జట్టుతో తలపడునుంది. ఈ మ్యాచ్ చూసేందుకు వేలాదిగా ప్రేక్షకులకు వస్తుంటారు కాబట్టి.. వారిలో సామాజిక స్పృహను తట్టి లేపేందుకు చెన్నై జట్టు ఈ తీరుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది.

ఇప్పుడు మాత్రమే కాదు ఇకపై చెన్నై జట్టు ఆడే మ్యాచ్ వేదికలలో ఇలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని ఆ జట్టు మేనేజ్మెంట్ చెబుతోంది.”ఓటు అనేది సామాజిక బాధ్యత. దానిని ప్రజలు వినియోగించుకోవాలి. కచ్చితంగా ఓటు వేయాలి. ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. మా సామాజిక బాధ్యతగా ఇలాంటి ఏర్పాట్లు చేశాం. కేవలం లక్నోలోనే కాదు.. చెన్నై జట్టు సొంత ప్రాంతం చెన్నైలోనూ ఇలానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. దీనివల్ల ప్రజలు స్ఫూర్తి పొంది ఓటు వేస్తే మాకు అంతకుమించి కావాల్సిందేముందని” చెన్నై జట్టు మేనేజ్మెంట్ చెబుతోంది. కాగా, ఈ ఫ్లెక్సీలను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వీటిపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.