Chiranjeevi on Bheemla Nayak: భీమ్లానాయక్ మూవీ విషయంలో జరుగుతున్న రాద్దాంతం అంతా ఇంతా కాదు. మొదటి నుంచి ఈ మూవీ మీద ఎన్నో వివాదాలు వస్తూనే ఉన్నాయి. అయినా సరే వాటన్నింటినీ పవన్ లెక్క చేయకుండా రిలీజ్ చేసి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నారు. అయితే ఏపీలో మాత్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పవన్ ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.
తగ్గించిన రేట్లకే టికెట్లు అమ్మాలని థియేటర్లకు నోటీసులు ఇవ్వడం, రెవెన్యూ ఉద్యోగులు తనిఖీలు చేయడం, చెప్పలేనన్ని ఆంక్షలు విధించేయడంతో చాలా చోట్ల థియేటర్లు మూసుకుంటున్నారు. అయితే ఈ వివాదంపై నాగబాబు స్పందిస్తూ.. ఒక హీరోను ఇంతలా ఇబ్బంది పెడుతున్నా ఇండస్ట్రీ నుంచి స్పందన కరువైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. వాటిని చూస్తే మెగా బ్రదర్‌కే షాక్ తప్పదేమో.
Also Read: TDP Bheemla Nayak: భీమ్లానాయక్ అవకాశాన్ని వాడేస్తున్న టీడీపీ.. ఆ భయంతో బీజేపీ కూడా..!
ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించే చిరంజీవి భీమ్లానాయక్ ఇబ్బందుల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముందుంటానని చెప్పే చిరంజీవి మరి సొంత తమ్ముడి సినిమా విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నిస్తున్నారు సినీ జనాలు. ఇది కూడా పెద్ద పాయింటే కదా. టికెట్ల రేట్ల వివాదాన్ని పరిష్కరించేందుకు ముందుండి జగన్‌తో చర్చలు జరిపిన చిరంజీవి.. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదని అంటున్నారు.
అందరికంటే పెద్ద అయిన చిరంజీవి ముందుగా స్పందించకుండా.. ఇండస్ట్రీ స్పందించాలని నాగబాబు డిమాండ్ చేయడమేంటని అంతా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి మెగా బ్రదర్‌కే ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ విషయంలో వైసీపీ కోపంగా ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకోసమే కావాలనే కొత్త జీవోను లేట్ చేస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ఇన్ని తెలిసిన చిరంజీవి.. ఈ వివాదాన్ని పెద్దది చేయడం ఎందుకు అనే మౌనంగా ఉంటున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. సినిమా ఎలా ఉంది అనే దానిపైనే స్పందించిన చిరు.. సమస్యలను మాత్రం గాలికి వదిలేయడం మెగా ఫ్యాన్స్‌కు నిరాశ కలిగిస్తోంది.
Also Read: Bheemla Nayak: ఆంధ్రా నడిబొడ్డున జగన్ కు షాకిచ్చిన పవన్ ఫ్యాన్స్.. ‘థాంక్యూ సీఎం సార్’ వైరల్