TDP Bheemla Nayak: రాజకీయాల్లో అవకాశాలు చెప్పి రావు. ఉన్న పరిస్థితులనే అవకాశంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఏపీలో టీడీపీ, బీజేపీ పార్టీలు ఇదే చేస్తున్నాయి. గత కొంత కాలంగా ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ బలంగా ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికలకు జనసేనతో కలిసి వెళ్లాలని అవసరమైతే బీజేపీని కూడా కలుపుకుని పోవాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆల్రెడీ జనసేన, బీజేపీ పార్టీలు పొత్తులోనే ఉన్నాయి.
చంద్రబాబు గతంలో బీజేపీ వ్యతిరేక చర్యల వల్ల బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయన్ను దగ్గరకు రానివ్వట్లేదు. అయితే ఎలాగైనా జనసేనకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగానే ప్రతి విషయంలో కూడా జనసేనకు మద్దతుగా ఉంటున్నారు. ఇప్పుడు తాజాగా భీమ్లానాయక్ విషయంలో చంద్రబాబు, లోకేష్ ఇలాంటి పనే చేశారు. భీమ్లానాయక్ విషయంలో ప్రభుత్వం చేస్తున్నది కక్ష్యం సాధింపు చర్యలని మండిపడ్డారు.
పనిలో పనిగా భీమ్లానాయక్ చాలా బాగుందంటూ టీడీపీ అగ్ర నేతలతో ట్వీట్లు చేయించారు చంద్రబాబు. అంటే పవన్ మెప్పు పొందేందుకు ఇలా చేస్తున్నారన్నమాట. ఇది కొంత వర్కౌట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ విషయంలో బీజేపీ కంటే ఎక్కువగా టీడీపీ స్పందిస్తోందని జనసైనికులు సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో పవన్ ఎక్కడ తమకు దూరం అవుతాడేమో అనే భయం అటు బీజేపీలో కూడా పెరిగిపోయింది.
Also Read: Bheemla Nayak: ఆంధ్రా నడిబొడ్డున జగన్ కు షాకిచ్చిన పవన్ ఫ్యాన్స్.. ‘థాంక్యూ సీఎం సార్’ వైరల్
ఇక తాజాగా వారు కూడా రంగంలోకి దిగిపోయారు. బీజేపీ స్టేట్ లీడర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. తాను విజయవాడలో కుటుంబంతో కలిసి భీమ్లా నాయక్ మూవీని చూశానని బాగుందని వివరించారు. అంతే కాకుండా జగన్ కుట్ర పూరితంగా ఈ సినిమాపై ఆంక్షలు విధించారంటూ విమర్శించారు.
సినిమాల విషయంలో రాజకీయాలను పక్కన పెట్టాలంటూ సూచించారు. మొత్తానికి అటు టీడీపీ, ఇటు బీజేపీ ఇద్దరూ కూడా పోటీ పోటీగా పవన్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఒకరిదేమో పొత్తు కోసం ఆరాటం అయితే.. మరొకరిదేమో దూరం అవుతాడేమో అనే భయం. ఇరువురు కలిసి పవన్‌ను బాగానే మోస్తున్నారు. మరి వీరి స్పందన పట్ల పవన్ రియాక్షన్ ఏంటో చూడాలి.
Also Read: Bheemla Nayak Excellent Day 1 Box Office Collections