https://oktelugu.com/

Prakash Raj: ప్రకాష్ రాజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అన్నిసార్లు బ్యాన్ చేయడానికి కారణం ఏంటి..?

కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిన కొన్ని సినిమాలకి కృష్ణ వంశీ కూడా ఆయన సినిమాలకి ప్రకాష్ రాజ్ ను దూరం పెట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు

Written By:
  • Gopi
  • , Updated On : September 19, 2023 / 11:00 AM IST
    Follow us on

    Prakash Raj:  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులలో ప్రకాష్ రాజ్ చాలా మంచి నటుడు అని అందరి చేత కీర్తింపబడ్డాడు కానీ ప్రకాష్ రాజ్ డిసిప్లేన్ పరంగా చూస్తే మాత్రం ఆయన్ని భరించడం చాలా కష్టం అని చాలా మంది పెద్ద డైరెక్టర్లు సైతం ఓపెన్ గా చెప్పేశారు. సినిమా ఇండస్ట్రీ ఆయన్ని చాలా సార్లు బ్యాన్ చేసింది దానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి.అవి ఏంటి అంటే ఆయన షూటింగ్ స్పాట్ కి తొందరగా రాడు వచ్చినా కూడా ఎప్పుడు ఏదో ఒక రభస చేస్తూనే ఉంటాడు అందువల్లే ప్రకాష్ రాజ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ నేమ్ ఉంది ఇది సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్న డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి మాత్రమే తెలుసు అది సినిమా చూసే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఆయన నటించిన పాత్రకి ఆయన ఎంతవరకి న్యాయం చేస్తున్నాడు అనే దాని మీదనే సగటు ప్రేక్షకుడు ఆయన్ని ఇష్టపడతాడు.ప్రకాష్ రాజుకి ఇండస్ట్రీలో బ్యాడ్ నేమ్ ఉన్నప్పటికీ జనాల్లో మాత్రం ఆయనకి ఒక మంచి నటుడుగా మంచి గుర్తింపు అయితే ఉంది.అయితే ఆయన ఆగడు సినిమా టైంలో శ్రీనువైట్ల తో గొడవ పెట్టుకుని టీవీ ఛానల్ లోకి వచ్చి శ్రీను వైట్ల గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడాడు.

    అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈయన షూటింగ్ కి లేటుగా రావడం ఎవరి మీద పడితే వాళ్ల మీద అరవడం లాంటివి చేయడం తో ఈయన ప్రవర్తన శ్రీనువైట్ల నచ్చకపోవడం వల్ల ఈయన్ని సినిమా నుంచి తీసి వేసి ఈయన ప్లేస్ లో సోను సూద్ ని తీసుకున్నాడు దానివల్ల కోపం తో రగిలిపోయిన ప్రకాష్ రాజ్ టీవీ ముందుకు వచ్చి చాలా రచ్చ రచ్చ చేశాడు. అయితే ప్రకాశ రాజ్ ని బ్యాన్ చేసినా కూడా తెలుగు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్లు చేయడానికి ఎవరూ లేరు అని చెప్పి ఆయన బ్యాన్ ఎత్తివేసి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు నటింపచేశారు దానివల్ల ఆయనకి గర్వం అనేది చాలా పెరిగిపోయి తనకిష్టం వచ్చిన టైంకి షూటింగ్ కి రావడం ఇష్టం వచ్చిన టైం కి వెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉండేవాడు అందుకే కొంతమంది డైరెక్టర్లు ఆయన్ని దూరం పెట్టారు. కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిన కొన్ని సినిమాలకి కృష్ణ వంశీ కూడా ఆయన సినిమాలకి ప్రకాష్ రాజ్ ను దూరం పెట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందన్నది…