https://oktelugu.com/

Star Maa vs Zee Telugu: డియర్ స్టార్ మా.. జీ తెలుగు వచ్చేసింది.. ఇవి వంటలక్క, డాక్టర్ బాబు రోజులు కావు..

మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం.. ఒక వెలుగు వెలిగిన జెమినీ పని ఇప్పుడు అయిపోయిందని.. అసలు వాస్తవంగా తెలుగులో ఉన్నవే నాలుగు చానల్స్.

Written By:
  • Rocky
  • , Updated On : September 19, 2023 / 10:56 AM IST
    Follow us on

    Star Maa vs Zee Telugu: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. దానికి తోడు అపరిమితమైన డాటా ఉంది. ఏం చేసుకుంటూ అయినా చూడవచ్చు. నచ్చిన దానిని మళ్లీ మళ్లీ వీక్షించవచ్చు. సో ఈ ప్రభావం అన్ని రంగాల మీద ఉంది. ముఖ్యంగా తెలుగు న్యూస్ ఛానల్స్ వీక్షణం మీద తీవ్రంగా ఉంది. పాపులర్ అనుకున్న డిబేట్ల రేటింగ్స్ కూడా దారుణంగా ఉంటున్నాయి. వాటిని చూసే వారి సంఖ్య చాలా చాలా తక్కువ. రాజకీయ పిచ్చి ఉన్న కొందరికి తప్ప.. మిగతా వారెవరికి అవి పట్టవు. పైగా డిబేట్ ప్రొజెక్టర్ల పైత్యం రోజురోజుకు ఏవగింపు కలిగిస్తోంది. న్యూస్ చానల్స్ పరిస్థితి ఇలా ఉంటే. మరి వినోద ఛానల్స్ పరిస్థితి ఏమిటి?

    మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం.. ఒక వెలుగు వెలిగిన జెమినీ పని ఇప్పుడు అయిపోయిందని.. అసలు వాస్తవంగా తెలుగులో ఉన్నవే నాలుగు చానల్స్. జెమినీ ఏకంగా ఆరు లేదా ఏడో ప్లేసులోకి జారిపోయింది. సినిమా ఛానళ్ళు దాన్ని దాటిపోయాయి. ఆఫ్ కోర్స్ జెమినీ టీవీయే ఒక సినిమా ఛానల్ గా మారిపోయింది. ఇక అందులో ప్రసరమైన సీరియల్స్ డిడి కాలంనాటి సీరియళ్ళతో పోటీ పడుతున్నాయి. రియాల్టీ షోలు దానికి చాలా చాలా దూరం. దీంతో జనం దానిని చూడటం మానేశారు. వాస్తవానికి సన్ యాజమాన్యమే దానిని వదిలేసింది.

    అయితే మొన్నటిదాకా మా టీవీ సీరియల్స్ లో దిట్ట అని చెప్పుకునే వాళ్ళం కదా..అవే దాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచుతున్నాయని అనుకున్నాం కదా..(జాతీయస్థాయిలోనూ కొన్నిసార్లు స్టార్ మా నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది) వాస్తవానికి మా టీవీ బలం సీరియల్సే. రియాల్టీ షోలు మాటీవీలో పెద్దగా లేవు..ఒక్క బిగ్ బాస్ మినహా. అసలు నాన్ ఫిక్షన్ అనే కేటగిరి మాటీవీ కి సరిగా చేతకాదు. ఎంతో ఖర్చుపెట్టి బిగ్ బాస్ ప్రోగ్రాం రన్ చేస్తుంటే అది పూర్ రేటింగ్స్ నమోదు చేస్తోంది. కార్తీకదీపం వంటి సీరియల్స్ తోనే స్టార్ మా.. జీ తెలుగును కొట్టేయగలిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాటీవీని జీ తెలుగు కొట్టేసింది. అయితే మా టీవీ కి ఉన్న సాధన సంపత్తితో పోల్చితే జీ తెలుగు తూగలేదు కాబట్టి.. దానికి తన ఘనతను ప్రచారం చేసుకోవడం తెలియడం లేదు.

    నిజానికి టాప్ 30 ప్రోగ్రాముల జాబితా చూస్తే ఎక్కడో దిగువన త్రినయని, ప్రేమ ఎంత మధురం వంటి జీ తెలుగు సీరియల్స్ కనిపిస్తాయి. టాప్ ప్లేస్ లో మొత్తం మా టీవీ సీరియల్స్ ఉంటాయి. కార్తీకదీపం రోజులు పోయినప్పటికీ బ్రహ్మముడి వంటి సీరియల్స్ ను మాటీవీ పైకి లేపుతోంది. అయినప్పటికీ ఫిక్షన్ కేటగిరీలో జీ తెలుగు ముందు వరుసలో ఉంది. తాజాగా రిలీజ్ అయిన బార్క్ రేటింగ్స్ కూడా ఇవే సూచిస్తున్నాయి. ఇక మిగతా ఛానల్స్ విషయానికి వస్తే ఈటీవీ ఎలాగూ డిడి, జెమినితో పోటీపడుతోంది. ఫిక్షన్ కేటగిరిలో అది స్టార్ మా, జీ తెలుగుకు చాలా దూరంలో ఉంది. పాత సినిమాల కారణంగా ఆ కేటగిరిలోనూ ఈటీవీ పూర్. ఈ మధ్య బేబీ సినిమా శాటిలైట్ రైట్స్ ఈటీవీ కొనుగోలు చేసింది. చూడాలి మరి ఏ స్థాయిలో రేటింగ్స్ వస్తాయో.. ఇక మూవీస్ కేటగిరిలోనూ ఈటీవీ చాలా పూర్ రేటింగ్స్ నమోదు చేస్తోంది. ఈ విభాగంలో జెమిని చాలా బెటర్..సన్ యాజమాన్యానికి మంచి వార్త ఏదైనా ఉందంటే అది ఇదే. “ఇక మా మూవీస్, జీ సినిమాలు” దాదాపు సేమ్.

    రియాల్టీ షోలలో ఈటీవీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. మిగతా కార్యక్రమాలు ఈటీవీ బలం. అయితే అవి మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ కాకపోవడంతో జనానికి బోర్ కొట్టేస్తున్నాయి. అందుకే ఈ కేటగిరిలో నూ ఈటీవీ వెనుకబడి ఉంది. ఒకప్పుడు అంతరంగాలు, ఇది కథ కాదు, శాంతినివాసం, మనోయజ్ఞం వంటి సీరియల్స్ తో తిరుగులేని స్థానంలో ఉండే ఈటీవీ.. ఇప్పుడు మూడవ స్థానంలోకి పడిపోవడం దాని స్వయంకృతాపరాధం. ప్రస్తుతానికైతే తెలుగు వినోద చానల్స్ పరిస్థితి ఇదీ.