Pushpa 2: The Rule : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ లాంటి ఒక నటుడు గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ని ఈయన హీరో ఏంటి అంటూ ఎగతాళి చేశారు. కానీ తను ఎక్కడ కూడా నిరాశ చెందకుండా కష్టపడుతూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. తన కెరియర్ లో తను చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు అందించచడంతో పాటుగా ఆయనకి స్టైలిష్ స్టార్ అనే బిరుదు కూడా సంపాదించి పెట్టాయి…
ఇక ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక దానికి తోడు గా ఈ సినిమా కి సిక్వల్ గా వచ్చిన ఆర్య 2 సినిమా అనుకున్న రేంజ్ లో మంచి విజయాన్ని సాధించలేకపోయింది. ఇక వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప సినిమా రిలీజ్ కి ముందు నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంది. ఇక వాళ్ల అంచనాలకి తగ్గట్టుగానే ఈ సినిమా రిలీజ్ అయి బ్లక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక నార్త్ లో అయితే ఈ సినిమా తన సత్తా చాటుకొని బాలీవుడ్ లో ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక దాంతో పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.
ఇక ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు. అయితే పుష్ప సినిమా రిలీజ్ అయి ఈ రోజుకి రెండు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఆ సినిమా గురించి అతని అభిమానులు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు.అలాగే పుష్ప సినిమాతో తెలుగు హీరోలకి ఎవ్వరికీ సాధ్యం కానీ నేషనల్ అవార్డ్ ని అల్లు అర్జున్ దక్కించుకున్నాడు. నిజానికి పుష్ప సినిమాకి మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత నిదానంగా ఈ సినిమా పాజిటివ్ టాక్ వైపు మళ్లింది అలాగే బాక్సాఫీస్ ని షేక్ చేసింది ఇక ఇప్పుడు పుష్ప2 సినిమాతో మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో సక్సెస్ సాధించాలని చూస్తున్నారు.
అయితే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు రెండు పార్ట్ లుగా తీద్దామనే ఆలోచన సుకుమార్ కి లేదు. కానీ అంత పెద్ద కథని ఒక్క సినిమాలో చెప్పడం కుదరదు కాబట్టి దాన్ని రెండు పార్టు లుగా చేద్దామని డిసైడ్ అయి పుష్ప 2 సినిమా కూడా చేస్తున్నారు. ఇక ఈ పుష్ప 2 సినిమాతో పుష్ప ఏ రేంజ్ లో సక్సెస్ ని సాధించిందో దానికి మించి సక్సెస్ సాధించాలనే సంకల్పంతో ఈ సినిమాని 300 కోట్లు బడ్జెట్ తెరకెక్కిస్తున్నారు. చూడాలి మరి పుష్ప సాధించిన రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేస్తుందా లేదా అనేది…