https://oktelugu.com/

TDP: మహిళతో అసభ్యంగా ఆ మాజీ ఎమ్మెల్యే చాటింగ్… ఇబ్బందుల్లో టిడిపి

తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే తన వద్దకు సాయం కోసం వచ్చిన మహిళలను లైంగికంగా వేధింపులు గురిచేసినట్లు బయటకు వచ్చింది. రాయలసీమకు చెందిన సదర మాజీ ఎమ్మెల్యే పై వైసీపీ నేతలు ఇప్పటికే తీవ్ర ఆరోపణలు కూడా చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 18, 2023 / 11:55 AM IST

    TDP

    Follow us on

    TDP: ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా వాచ్ చేస్తుందన్న విషయం గమనించాలి. అయితే ఇది తెలియక చాలామంది నాయకులు తప్పులో కాలేస్తున్నారు. తాజాగా రాయలసీమ చెందిన టిడిపి మాజీ ఎమ్మెల్యే ఒకరు సోషల్ మీడియాకు అడ్డంగా బుక్ అయ్యారు. ఓ మహిళతో అసభ్యంగా చాటింగ్ చేసిన వైనం బయటపడింది. ఎన్నికల ముంగిట ఇది టిడిపికి ఇబ్బంది పెట్టేలా ఉంది. వైసీపీకి వరంలా మారింది. దీంతో ఆ పార్టీ సోషల్ మీడియా హోరెత్తిస్తోంది.

    తెలుగుదేశం పార్టీలో చాలామంది మహిళా నాయకులు అసౌకర్యానికి గురయ్యారు అన్న అపవాదు ఉంది. దీనినే ఆసరాగా చేసుకుని చాలామంది టిడిపిని వీడారు. సినీ నటులు కవిత, దివ్యవాణి, వాణి విశ్వనాథ్ తో పాటు యామిని శర్మ పాలేటి కృష్ణవేణి వంటి మహిళా నేతలు టిడిపికి గుడ్ బై చెప్పినవారే. పార్టీలో నెలకొన్న వాతావరణం, మహిళల పట్ల చులకన భావం, అగౌరం వంటి కారణాలతో వారు పార్టీని వీడారు. ముఖ్యంగా మహిళా నేతలు టిడిపిలో అభద్రతాభావంతో ఉంటారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే అక్కడ పరిస్థితులు ఉండడం.. కొన్ని ఘటనలు వెలుగు చూస్తుండడంతో టిడిపి శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

    ఇప్పుడు తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే తన వద్దకు సాయం కోసం వచ్చిన మహిళలను లైంగికంగా వేధింపులు గురిచేసినట్లు బయటకు వచ్చింది. రాయలసీమకు చెందిన సదర మాజీ ఎమ్మెల్యే పై వైసీపీ నేతలు ఇప్పటికే తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆ మాజీ ఎమ్మెల్యే ఓ మహిళతో అసభ్యంగా చాటింగ్ చేస్తూ దొరికిపోయారు. సోషల్ మీడియాలో ఆయనపై ఒక రకమైన ప్రచారం ప్రారంభమైంది. అధికారంలో ఉన్నప్పుడే ఏదైనా సమస్యపై వచ్చే మహిళలను ఇబ్బంది పెడతారన్న ఆరోపణ ఆయనపై ఉంది. ఆయన ఒక్క ఫోన్ చాటింగ్తో మాత్రమే కాదని.. బయటికి రాని రాసలీలలు చాలా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    చేతిలో అధికారం లేకపోయినా ఆయన తీరు మారలేదని తాజాగా వచ్చిన చాటింగ్ ఘటన తెలియజేస్తోంది. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన మహిళలను అవసరానికి వాడుకోవడంలో సదరు మాజీ ఎమ్మెల్యే సిద్ధహస్తుడని ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల కిందట వైసీపీకి చెందిన తాజా మాజీ మంత్రులపై ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో టిడిపి దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇప్పుడు టిడిపి మాజీ ఎమ్మెల్యే అడ్డంగా దొరకడంతో వైసిపి ఓ రేంజ్ లో ప్రచారం చేస్తోంది. ఎన్నికల ముంగిట ఇది టిడిపికి నష్టం చేసే విషయమేనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.