https://oktelugu.com/

Roja: రోజాను సైడ్ చేసే పనిలో పెద్దిరెడ్డి.. జగన్ గ్రీన్ సిగ్నల్

నగిరి నియోజకవర్గ నుంచి రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో తొలిసారిగా వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. 2019లో మాత్రం అతి కష్టం మీద గెలుపొందారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 18, 2023 11:49 am
    Peddireddy-roja
    Follow us on

    Roja:  వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాను దాదాపు పక్కన పెట్టినట్టేనా? వచ్చే ఎన్నికల్లో ఆమె గెలుపు సాధ్యం కాదని హై కమాండ్ భావిస్తోందా? ఇప్పటికే కొత్త అభ్యర్థిని బరిలో దించారా? ప్రచారం చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం నగిరి నియోజకవర్గ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రోజాను తప్పిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. ఓ నాయకుడు తానే వైసిపి అభ్యర్థిని ప్రచారం చేసుకుంటుండడం విశేషం.

    నగిరి నియోజకవర్గ నుంచి రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో తొలిసారిగా వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. 2019లో మాత్రం అతి కష్టం మీద గెలుపొందారు. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో రోజాకు క్యాబినెట్ లో చోటు దక్కింది.అయితే ఆమెకు సొంత పార్టీ శ్రేణుల్లోనే వ్యతిరేకత ఉంది. తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఈసారి పోటీ చేస్తే ఆమె ఓటమి ఖాయమన్న టాక్ నడుస్తోంది. హై కమాండ్ సైతం ఇదే నివేదికలు అందాయి. దీంతో నగిరి లో రోజా మార్పు అనివార్యమని తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ వైసీపీ హై కమాండ్ ప్రత్యామ్నాయ నాయకుడిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

    పేరుకే మంత్రి కానీ నగిరి నియోజకవర్గంలో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పట్టు ఎక్కువ. రోజా కంటే పెద్దిరెడ్డి మనుషులకే అక్కడ ప్రాధాన్యం లభిస్తుంది. పెద్దిరెడ్డి అండ చూసుకుని అక్కడ రోజాను ఎవరు లెక్క చేయడం లేదు. దీనిపై పలుమార్లు రోజా హై కమాండ్ కు ఫిర్యాదులు చేశారు. కానీ అగ్ర నాయకత్వం అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమీపిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల మార్పులో భాగంగా.. రోజాకు టిక్కెట్ ఇవ్వకూడదని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

    రోజా స్థానంలో అదే నియోజకవర్గానికి చెందిన రెడ్డి వారి చక్రపాణి రెడ్డికి టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన శ్రీశైలం దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. నగిరి టికెట్ తనకే దక్కుతుందని.. ఆదరించాలని నియోజకవర్గ వ్యాప్తంగా చక్రపాణి రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఈయన పెద్దిరెడ్డి అనుచరుడు. ఆయన ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. దీంతో హై కమాండ్ సైతం చక్రపాణి రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోజాకు టిక్కెట్ ఇచ్చిన గెలవరన్న ప్రచారాన్ని ప్రత్యర్థులు బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో విస్తృత ప్రచారం జరిగి రోజాకు నష్టం జరుగుతోంది.

    వైసీపీ హై కమాండ్ చేయించిన సర్వేల్లో సైతం రోజా ఓటమి తప్పదని తేలినట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ఎటువంటి మొహమాటలకు పోకూడదని భావిస్తున్నారు. దీంతో రోజా ను పక్కన పెట్టడానికి జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రెడ్డివారి చక్రపాణి రెడ్డి స్థానికుడు. ఆయన కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆయనకు టిక్కెట్ ఇస్తే నియోజకవర్గం లోని అసమ్మతి నాయకులు సైతం పనిచేస్తారని హై కమాండ్ కు సమాచారం ఉంది. ఒకవేళ చక్రపాణి రెడ్డికి టికెట్ ఇస్తే రోజా సహకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.