https://oktelugu.com/

Pawan Kalyan: సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా ప్లాప్ కి పవన్ కల్యాణే కారణమా..?

బాబీ డైరెక్షన్ లో తెరకెక్కించినప్పటికీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే సాధించలేదు. ఇక ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ అందించిన కథ కూడా పెద్దగా సక్సెస్ అయితే అవ్వలేదు.

Written By:
  • Gopi
  • , Updated On : March 4, 2024 / 01:40 PM IST
    Follow us on

    Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో చూపిస్తూ దాదాపు 30 సంవత్సరాల నుంచి స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందుతున్న నటుడు పవన్ కళ్యాణ్. ఈయన తీసిన సినిమాలు దాదాపు సక్సెస్ లు సాధించడమే కాకుండా సూపర్ హిట్లు గా కూడా నిలిచాయి. ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ చాలా ఇష్టంగా గబ్బర్ సింగ్ సినిమాకి సీక్వెల్ స్టోరీని రాసుకున్నాడు.

    ఇక ఈ సినిమాని బాబీ డైరెక్షన్ లో తెరకెక్కించినప్పటికీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే సాధించలేదు. ఇక ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ అందించిన కథ కూడా పెద్దగా సక్సెస్ అయితే అవ్వలేదు. అయితే ఈ సినిమా మీద అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కథలు అందించడం కంటే కథా రచయితలకి గాని, దర్శకులకు గాని ఇస్తే వాళ్లు మొత్తం కథ రెడీ చేస్తారు కదా అంటూ ఈ సినిమా స్క్రిప్ట్ మీద చాలా విమర్శలు అయితే వచ్చాయి.

    అయినప్పటికీ దాని మీద పవన్ కళ్యాణ్ ఎలాంటి స్పందనను తెలియజేయలేదు. సర్దార్ గబ్బర్ సింగ్(Sardaar Gabbar Singh) సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఈ స్టోరీ కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే అనేది ఈ సినిమాకి భారీ దెబ్బ కొట్టిందనే చెప్పాలి. ఇక ముఖ్యంగా బాబీ డైరెక్షన్ బాగున్నప్పటికీ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే లో ఉన్న లోపాల కారణంగానే ఇది సక్సెస్ ని సాధించలేకపోయింది.

    ఇక దానికి మించి గబ్బర్ సింగ్ సినిమాలో ఉన్న విలన్ బ్యాచ్ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణం అయిందని ఈ సినిమాలో కూడా మూడు, నాలుగు బ్యాచ్ లను పెట్టి వాళ్ల చేత కామెడీ చేయించాలని చూసిన వాళ్ల చేష్టలు ప్రేక్షకులకు ఏమాత్రం కామెడీగా అనిపించకపోగా చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. దాని వల్లే ఈ సినిమా చాలావరకు ప్రేక్షకులను నిరాశపరిచింది.