Naveen Polishetty Remuneration: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి లాంటి నటుడు వైవిద్యమైన నటనను కనబరుస్తూ ప్రేక్షకుల్లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ఆయన నటుడు గానే కాకుండా రైటర్ గా కూడా తన సత్తా చాటాడు. ఇక తను ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఏడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఆయన కేవలం నాలుగు సినిమాలను మాత్రమే చేశాడు… నిజానికి ఆయన పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని సినిమాలను చేస్తున్నాడు. ఆయన చేసిన సినిమాలన్నీ సక్సెస్ ఫుల్ గా నిలవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఆచితూచి మరి అడుగులు వేస్తున్నాడు.
100% సక్సెస్ రేట్ కలిగి ఉన్న హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం తన రెమ్యూనరేషన్ ని భారీ రేంజ్ లో పెంచినట్టుగా తెలుస్తుంది. మొన్నటి వరకు 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఆయన ఇప్పుడు 10 కోట్లకు పైన రెమ్యూనరేషన్ ను ఛార్జ్ చేస్తున్నారట. హీరో గానే కాకుండా ఆయన సినిమాకు తనే రైటర్ గా వ్యవహరిస్తున్నాడు.
కాబట్టి రైటర్ గా సైతం తను రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అనగనగా ఒక రాజు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాకి కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన ఎవరితో సినిమా చేస్తున్నాడు ఎలాంటి సినిమా చేస్తున్నాడు అనే విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరమైతే ఉంది…
మొత్తానికైతే ఈ యంగ్ హీరో అటు హీరోగా, ఇటు రైటర్ గా రెండు చేతుల సంపాదిస్తున్నాడు అంటూ నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు… చాలా సంవత్సరాల పాటు సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలను అందుకున్న ఆయన హీరోగా మారి సక్సెస్ లను సాధించడం పట్ల అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు… ఇక ముందు ముందు కూడా ఇలాంటి భారీ సక్సెస్ లను సాధించి స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…