Chiranjeevi favorite movie: మాటల మాంత్రికుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్…తన కెరియర్ మొదట్లో వరుస సక్సెస్ లను సాధించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించడం విశేషం… ప్రస్తుతం వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ప్రస్తుతం ఉన్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంతవరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి. ఇక ఆయన నుంచి వచ్చే సినిమాలన్నీ హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇక ప్రస్తుతం తన తోటి దర్శకులందరు పాన్ ఇండియాలో సత్తాను చాటుతున్నారు.
కాబట్టి త్రివిక్రమ్ సైతం పాన్ ఇండియా బాట పట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్న సినిమాతో సక్సెస్ ను సాధించి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది.
కాబట్టి ఆ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవ్వాలి అంటే త్రివిక్రమ్ సక్సెస్ లో ఉండాలి. అందుకోసమే వెంకటేష్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తీసి సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ అంటే చిరంజీవి కి చాలా ఇష్టం…ఆయన చేసిన సినిమాలన్నింటిలో మెగాస్టార్ చిరంజీవికి ‘అత్తారింటికి దారేది’ సినిమా అంటే చాలా ఇష్టమంట.
అలాంటి జానర్ లోనే తనతో కూడా ఒక సినిమా చేయమని మెగాస్టార్ చిరంజీవి గతంలో త్రివిక్రమ్ అని అడిగాడు. నిజానికి ‘సైరా’ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు… ఇక ఫ్యూచర్లో వీళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…