Kalki-Brahmastra: బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలతో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర ‘ సినిమా అయితే కథపరంగా బాగున్నప్పటికీ దాన్ని విజువల్ పరంగా అంత అద్భుతంగా చూపించలేకపోయారు. నిజానికి ఈ సినిమా లో హీరోగా నటించిన రన్బీర్ కపూర్ ఈ సినిమాకి అసలు సెట్ అవ్వలేదు. ఆయన చాక్లెట్ బాయ్ లా ఉంటూ లవ్ స్టోరీస్ ను మాత్రమే చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరి అలాంటి సమయంలో ఒక ప్రయోగం చేసినప్పుడు ఆయా దర్శకులు దాన్ని సరిగ్గా పోట్రే చేయాలి.
కానీ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కి మరొక క్యారెక్టర్ కి మధ్య కనెక్టివిటీ అనేది చాలావరకు లోపించింది. ఎక్కడి నుంచి సినిమాని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కన్వే చేయడంలో డైరెక్టర్ అయన్ ముఖర్జీ చాలావరకు తరబడ్డాడనే చెప్పాలి. ఇక అందువల్లే ఈ సినిమా ప్లాప్ అయింది. మరి రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి సినిమా ఎందుకు సూపర్ సక్సెస్ అయ్యింది అంటే ఆ సినిమాలో క్యారెక్టర్లను చాలా బాగా రాసుకున్నారు. ఏ మిస్టేక్ చేయకూడదనే ఉద్దేశ్యంతో ముందు పకడ్బందీగా స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు షూట్ కి వచ్చినట్టుగా తెలుస్తుంది.
అందుకే క్యారెక్టర్స్ లో ఉన్న వరల్డ్ బిల్డింగ్ గాని క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్ ను గాని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మొదటి నుంచి చివరి వరకు చాలా పర్ఫెక్ట్ గా పోట్రే చేశారు. అందువల్లే కల్కి సినిమా భారీ ఇమేజ్ ను దక్కించుకోవడమే కాకుండా భారీ సక్సెస్ లతో కూడా ముందుకు దూసుకెళ్తుంది. ఇక సినిమాని తీయడం ముఖ్యం కాదు దాన్ని సక్సెస్ అయ్యే రీతిలో తెరకెక్కించడమే ముఖ్యమని మరొకసారి ప్రూవ్ చేశాడు. బాలీవుడ్ వాళ్లు సినిమా స్టోరీ ల మీద దృష్టి పెడుతున్నారు.
కానీ మేకింగ్ మీద అసలు పెద్దగా దృష్టి పెట్టడం లేదు అంటూ పలు విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని చూస్తున్న వాళ్లకి ఒకంతుకు భయం పట్టుకుందనే చెప్పాలి. దానివల్లే వాళ్లకు ఎలాంటి సినిమాలు చేయాలనేది తెలియక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉంటూ సరైన సినిమాలు చేయలేక డీలా పడుతున్నారు…