https://oktelugu.com/

Telugu Movies: 1000 కోట్ల కు పైన కలెక్షన్స్ ను రాబట్టిన తెలుగు సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

Telugu Movies: కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం డీలా పడిపోతున్నాయి. ఇక 1000 కోట్లకు పైన వసూళ్లను సాధించిన తెలుగు సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం...

Written By:
  • Gopi
  • , Updated On : July 2, 2024 / 02:30 PM IST

    Do you know how many Telugu movies have collected more than 1000 crores

    Follow us on

    Telugu Movies: ప్రస్తుతం పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా కూడా 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాయి. ఇక అందులో కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం డీలా పడిపోతున్నాయి. ఇక 1000 కోట్లకు పైన వసూళ్లను సాధించిన తెలుగు సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…

    రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా దాదాపు 2000 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమా మొదటి 1000 కోట్లు, మొదటి 2000 కోట్లు సాధించిన తెలుగు సినిమాగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా కూడా 1300 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో రాజమౌళి వరుసగా రెండుసార్లు వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు…

    ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ రెండు సినిమాలు మాత్రమే వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాయి. ఇక ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి సినిమా కూడా 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక మీదట రాబోయే సినిమాలైనా పుష్ప 2, గేమ్ చేంజర్, ఓజి లాంటి సినిమాలకు కూడా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టే సత్తా ఉందనే చెప్పాలి.

    ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టిన దర్శకులలో రాజమౌళి ఒక్కడే ఉండడం విశేషం. ఇక ఆయన బాటలోనే ప్రస్తుతం ఉన్న దర్శకులందరూ నడుస్తూ భారీ కలెక్షన్లను రాబడుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళ సత్తా చాటాలని చూస్తున్నారు…