Kamal Haasan : కమల్ హాసన్ ను ఆర్ట్ సినిమాలు చేసేలా ప్రేరేపించిన తెలుగు సినిమా ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు డిఫరెంట్ పాత్రలను పోషించి మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తారు. ఇక ఇక్కడ ఒకసారి మంచి పేరు వచ్చిందంటే చాలు అదే స్టార్ డమ్ ను మెయింటైన్ చేసుకుంటూ ముందుకు సాగవచ్చు...

Written By: Gopi, Updated On : August 16, 2024 9:17 am

Kamal Hasan,s Art Films

Follow us on

Kamal Haasan : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ కమల్ హాసన్ కి ఉన్న గుర్తింపు వేరే ఏ హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసే సినిమాలు కళాత్మకమైన సినిమాలే కాకుండా వాటితో ప్రేక్షకులను సైతం మెప్పించే సత్తా ఉన్న నటుడు కూడా కావడం విశేషం… ఇక రీసెంట్ గా ‘భారతీయుడు 2’ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్న కమల్ హాసన్ ఇప్పుడు ‘భారతీయుడు 3’ సినిమాను కూడా లైన్ లో పెడుతున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వచ్చిన చాలా సినిమాల్లో ఆయనకు మాత్రం ఒక సినిమా అంటే చాలా ఇష్టమట.. ఇంతకీ అది ఏ సినిమా అంటే కే. విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం ‘ సినిమా అంటే ఆయనకి ఇప్పటికీ చాలా ఇష్టమట.

ఆ సినిమాలో ఒక మనిషి తాలూకు ఎమోషన్స్ గాని, ఒక సినిమా ఎలా ఉండాలి అందులోనూ ఒక ఆర్ట్ సినిమాకి సంబంధించిన ప్రాపర్ ఎడ్యుకేషన్ మొత్తం దాంట్లో ఉంటుందని ఆ సినిమాను చూసే తను కూడా ఆర్ట్ సినిమాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చానని ఒక సందర్భంలో తెలియజేశారు. ఇక మొత్తానికైతే తమ గురువు అయిన కె విశ్వనాథ్ గారి సినిమా వల్లే తను ఆర్ట్ సినిమాల వైపు నడిచానని చెప్పడం నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి…ఇక కమల్ హాసన్ తన కెరియర్ లో ఎన్నో సాహసవంతమైన సినిమాలను చేసి సక్సెస్ ఫుల్ గా నిలిచారు.

ఆయన చేయని పాత్ర అనేది లేదు ఏ పాత్రలో నటించిన కూడా దాంట్లో 100% ఎఫర్ట్ పెట్టి నటించడం కమల్ హాసన్ ఒక్కడికే సాధ్యమవుతుంది. అందుకే మనలో ఎవరైనా కొంచెం బాగా నటిస్తే వాళ్ళను కమల్ హాసన్ అంటూ ఫన్నీగా కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. ఇక ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో ‘దశావతారం ‘ సినిమాలో ఏకంగా 10 పాత్రల్లో నటించి సినిమా మీద ఆయన డెడికేషన్ ఎలా ఉంటుందో నిరూపించాడు. ఒక పాత్రలో నటించడమే చాలా కష్టం అనుకున్న రోజుల్లో ఆయన 10 పాత్రలను చేసి మెప్పించడం అనేది నిజంగా సాహసం అనే చెప్పాలి.

ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క వేరియేషన్ ని చూపిస్తూ హావ భావాలను పలికిస్తూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు… అందుకే కమల్ హాసన్ కి తెలుగు తమిళ రెండు ఇండస్ట్రీల్లో కూడా చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక ఇప్పటికీ కూడా ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే ప్రేక్షకుల్లో చాలా మంచి అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. అంతటి గొప్ప పేరును సంపాదించుకోవడానికి ఆయన ఎంతలా కష్టపడి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు…