Pushpa: అల్లు అర్జున్, సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు ముఖ్య కారణం.. అల వైకుంఠపురములో సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేయడమే. ఆ స్థాయి హిట్ తనకు వచ్చిన తర్వాత బన్నీలో కూడా భారీ మార్పులు వచ్చాయి. అందుకు పాన్ ఇండియా సినిమా చేయాలని పుష్పను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు.

అయితే, పుష్ప పై అంచనాలు రెట్టింపు అవ్వడానికి మరో కారణం సుకుమార్. నాన్ బాహుబలి రికార్డ్స్ ను ముందుగా బ్రేక్ చేసింది రంగస్థలం సినిమా. రంగస్థలం హిట్ తర్వాత సుకుమార్ కి బాగా డిమాండ్ పెరిగింది. అన్నిటికి మించి బన్నీ, సుక్కు ఇంతకుముందు చేసిన సినిమాలన్ని మంచి విజయాలు సాధించాయి.
దీనికితోడు పుష్ప ఊర మాస్ సినిమాగా తెరకెక్కిందని ప్రోమోలను చూస్తే అర్ధం అవుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంతకుముందు ఏ తెలుగు సినిమా తెరకెక్కలేదు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తికి తగ్గట్టుగానే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్ లో పెట్టిన టికెట్లు వెంటనే అమ్ముడైపోతున్నాయి.
దీనిబట్టి పుష్పకు భారీ ఓపెనింగ్స్ ఖాయం, అయితే, మొదటి రెండు రోజుల తరువాత పుష్ప పరిస్థితి ఏమిటా అని మేకర్స్ భయ పడుతున్నారు. పుష్పకు పోటీ ఎక్కువ ఉంది. ముందు, వెనుక చాలా సినిమాలు పుష్ప పై పోటీకి దిగుతున్నాయి. ముందుగా పుష్ప కంటే ముందు రోజు హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి.
Also Read: Rajamouli Mark: రాజమౌళి మార్క్ స్ట్రాటజీ.. భారీ డీల్ సెట్?
ఇక 24న బాలీవుడ్ సినిమా 83 కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ‘నాని’ మూవీ శ్యామ్ సింగరాయ్ కూడా రిలీజ్ కి సిద్ధం అంటుంది. మరి ఈ సినిమాలన్నీ వారం వ్యవధిలో వస్తున్నాయి కాబట్టి.. కచ్చితంగా పుష్ప వసూళ్ల మీద భారీ ప్రభావం చూపిస్తాయి. మరి ఈ పోటీలో పుష్ప ఎలా తట్టుకుంటుందో చూడాలి.
Also Read: Marakkar: మోహన్‌లాల్ ‘మరక్కార్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?