https://oktelugu.com/

Durga Ashtami 2024: దుర్గాష్టమి విశిష్టత, ప్రత్యేకతలు ఏంటి? ఈరోజున ఎలాంటి పూజలు చేస్తారు?

2024 ఏడాదిలో అక్టోబర్ 11న దుర్గాష్టమి రాబోతుంది. తొమ్మిదిరోజుల పాటు పార్వతి దేవీ వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. అక్టోబర్ 3న ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాల రోజు బాల త్రిపుర సుందరి అవతారంలో కనిపించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 9, 2024 / 12:01 PM IST

    Durga Ashtami 2024

    Follow us on

    Durga Ashtami 2024: హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని పండుగలకు ప్రత్యేక విశిష్టత ఉంటుంది. ఈ పండుగల సందర్భంగా భక్తలు వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించుకుంటారు. భాద్రపద మాసం తరువాత అశ్వయుజ మాసంలో వచ్చే దుర్గాష్టమి పండుగను తరతరాలుగా వివిధ పద్దతుల్లో నిర్వహించుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతంలో దుర్గాష్టమిని జరుపుకుంటారు. కానీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. అయితే దుర్గాష్టమికి ముందు 8 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఊరు వాడాల్లలో పార్వతి దేవి అమ్మవారు విగ్రహాలను నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దుర్గాదేవి కొలువైన తరువాత 9 రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. వీటిలో 9వ రోజు నిర్వహించే పండుగ అత్యంత విశిష్టమైనది. ఆ తరువాత నవమి రోజు నిర్వహంచే విజయదశమి మరింత కీలకమైనది. అయితే దుర్గాష్టమి పండుగ విశేషాలెంటో తెలుసుకుందాం..

    2024 ఏడాదిలో అక్టోబర్ 11న దుర్గాష్టమి రాబోతుంది. తొమ్మిదిరోజుల పాటు పార్వతి దేవీ వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. అక్టోబర్ 3న ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాల రోజు బాల త్రిపుర సుందరి అవతారంలో కనిపించారు. ఇలా 8 రోజుల పాటు వివిధ అవతారాలు ఎత్తి 9వ రోజున దుర్గామాత అవతారంలో కనిపిస్తుంది. ఈరోజు దుర్గా మాత అవతారం ఎత్తి మహిషాసురుడిపై పోరాటం చేస్తుంది. దశమి రోజున మహిషాసురుడిని అంతం చేస్తుంది. అందుకే ఈరోజు విజయానికి ప్రతీకంగా విజయదశమి వేడుకలను నిర్వహిస్తారు. దుర్గాష్టమి సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించుకుంటారు.

    కొన్ని పంచాంగాల ప్రకారం అక్టోబర్ 10న ఉదయం 5.45 నుంచి 6 గంటల మధ్య దుర్గా పూజను నిర్వహిస్తారు. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ధైర్య సాహాలు వస్తాయని నమ్ముతారు. అలాగే దుర్మార్గపు శక్తుల నుంచి విముక్తి అవుతారని అంటారు. ఈరోజు పూజ చేసేవారి అమ్మవారికి ప్రత్యేకమైన పుష్పాలు, పండ్లు సమర్పించాలి. అలాగే 108 దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలు చీకటిపై విజయం సాధించిన కాంతికి చిహ్నంగా వెలిగిస్తారు. అలాగే 108 తామర పువ్వులు అమ్మవారి వద్ద ఉంచుతారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యాలను కూడా 108 రకాలుగా చేస్తారు.

    దుర్గాష్టమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయాలను పూలతో అలంకరణ చేస్తారు. ఆ తరువాత భక్తుల దర్శనార్థం అమ్మవారిని దుర్గాదేవిగా కనిపించేలా అలంకరిస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత అవతారం ఎత్తిన తరువాత మరుసటి రోజు అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే విజయదశమి రోజున ఉదయం అమ్మవారి ఆలయాలు, విగ్రహాలు నెలకొల్పిన మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే వాహనాలు, ఆయుధ పూజలు చేస్తారు. ఈరోజు ఆయుధ పూజ చేయడం వల్ల ఏడాదంతా తల్లి దయ ఉంటుందని భావిస్తారు. ఈసారి దుర్గాష్టమికి ఆంధ్రప్రదేశ్ లోని ఇంద్రకీలాద్రి, తెలంగాణలోని ఏడుపాయల గుడి వంటి ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇదే రోజు జమ్మి చెట్టు ఆకులను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. కొందరు సాయంత్రం ఆలయాలను దర్శిస్తారు.