Deepika Padukone: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దీపిక పదుకొనె కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. కెరియర్ మొదట్లో అవకాశాల కోసం విపరీతమన్న ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు దారుఖ ఖాన్ తో అవకాశం రావడం ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది… ఇక అప్పటి నుంచి ఆమె చేసిన సినిమాలతో భారీ హైప్ క్రియేట్ అయింది. దాదాపు 20 సంవత్సరాల నుంచి టాప్ హీరోయిన్ గా వెలుగొందింది… ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె రీసెంట్ గా కొన్ని పెద్ద ప్రాజెక్టులకు కమిట్ అయింది. కానీ పాన్ వరల్డ్ సినిమాల నుంచి వరుసగా తనను తీసివేస్తుండటంతో ఆమె ఏం చేయని ఒక దిక్కు తోచని పరిస్థితిలో ఉందంటూ కొన్ని కథనలైతే వెలువడుతున్నాయి. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్ ‘ సినిమాలో మొదట దీపిక పదుకొనె ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ అనుకోని కారణాలవల్ల ఆమెను ఆ సినిమా నుంచి తప్పించారు.
కారణం ఏంటి అంటే ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ ను అడగడం, అలాగే భారీ కండిషన్లు పెట్టడం ద్వారా ఆమెను సినిమా నుంచి తప్పించారు. ఇక రీసెంట్ గా ‘కల్కి 2’ సినిమా నుంచి కూడా తనని తప్పించినట్టుగా ఆ సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే వెలువడ్డాయి. ఇక ఇదిలా ఉంటే అట్లీ – అల్లు అర్జున్ సినిమా నుంచి కూడా ఆమె ను తొలగిస్తున్నారు అంటు కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి.
ఆమె ఈ సినిమా లో నటిస్తుందా? లేదా అనే విషయాల మీద క్లారిటీ రావడం లేదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే దీపిక పదుకొనే క్యారెక్టర్ ని మెయిన్ హీరోయిన్ గా కాకుండా చిన్న గెస్ట్ రోలుగా మార్చి తనను ఆ సినిమాలో తీసుకోవాలనే ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన వస్తున్నప్పటికి ఆమె చేస్తున్న సినిమాలు భారీ విజయాలను సాధిస్తాయా లేదా అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలతో వ్యక్తం అవుతున్నాయి…
ఇక ఈ సినిమా యూనిట్ మాత్రం సోషల్ మీడియాలో వస్తున్న కథనాలేవి సరైనవి కాదని, ఈ మూవీ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను వాళ్ళు తొందరలోనే వెల్లడిస్తామంటూ అల్లు అర్జున్ సినిమా మేకర్స్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి… ఇక ప్రస్తుతం ఆమె షారుఖ్ ఖాన్ తో ఒక సినిమాకి కమిట్ అయింది. ఇప్పుడు పోలాండ్ లో ఆ సినిమా షూటింగ్ లో కూడా ఆమె పాల్గొంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…