Naveen Polishetty: ఒక సినిమా తీసి సక్సెస్ ని సాధించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని… ఎందుకంటే ఆ సినిమా కథ ఏ జానర్ కి చెందింది…ఆ సినిమాను ప్రేక్షకుడికి నచ్చేట్టుగా ఎలా చేయాలి అని దర్శకుడు అనునిత్యం మధనపడుతూ ఒక బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి లాంటి యంగ్ హీరో సైతం ఒక బెస్ట్ సినిమాను ప్రేక్షకులకు అందించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన సినిమా సినిమాకి మధ్య చాలా ఎక్కువ గ్యాప్ తీసుకుంటాడు. తక్కువ సినిమాలు చేసిన కూడా ప్రేక్షకుడికి నచ్చే సినిమాలు చేయాలనే ఆయన ముందుకు సాగుతున్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే దసర పండుగను పురస్కరించుకొని అనగనగా ఒక రాజు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని చేపట్టారు.
నవీన్ పోలిశెట్టి గోదారి గట్టున నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది ప్రేక్షకులు అతన్ని కలిసి ఏం బాబు ఇలా వెళ్తున్నావు నీ ఫేస్ బ్రైట్ గా వెలిగిపోతుంది అని అడగగా, మన సినిమా గురించి మీకు తెలుసు కదా అని నవీన్ పోలిశెట్టి అడుగుతాడు. వాళ్లు మాకెందుకు తెలియదు ‘అనగనగా ఒక రాజు’ అంటూ సినిమా టైటిల్ ని చెప్పేసారు. సినిమా కోసం మేమంతా వెయిట్ చేస్తున్నామంటూ వాళ్ళు చెప్పిన మాటలతో ఇంప్రెస్ అయిన నవీన్ పోలిశెట్టి వాళ్ళందరికి టికెట్లను ఫ్రీగా ఇస్తున్నాను అంటూ ప్రకటించారు.
దాంతో తన సినిమాని చాలా డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తున్నాడంటూ అలాగే ప్రమోషన్స్ భారీ లెవెల్లో చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనలైతే వెలువడుతున్నాయి. ఇక ఇంతకుముందు అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు సైతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు భారీగా ప్రమోషన్స్ చేపట్టి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లి సూపర్ సక్సెస్ ని సాధించాడు.
ఇప్పుడు ఈ సినిమాని సైతం ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే నవీన్ పోలిశెట్టి లాంటి యంగ్ హీరో సైతం అనిల్ రావిపూడి కి గట్టిపోటీ ఇస్తు ప్రమోషన్స్ చేపట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అంటూ చాలా మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…
#AnilRavipudi has a serious competitor this Sankranthi to promote his film.#AnaganagaOkaRaju pic.twitter.com/um838P1uby
— Gulte (@GulteOfficial) October 2, 2025