Highest First Day Grossing Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సినిమాలకు చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఎప్పుడు వచ్చిన కూడా ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాను బేస్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. ఇంతకు ముందు వచ్చిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించక పోయిన కూడా రీసెంట్ గా వచ్చిన ‘ఓజీ’ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించింది. మొదటి రోజు 154 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ 10 సినిమాల జాబితాలో నిలిచింది… ఇప్పటివరకు ఈ సినిమా 252 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి 300 కోట్లు సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల్లో 250 కోట్లకు పైన కలెక్షన్స్ ను సాధించిన సినిమాల్లో ఓజీ 14వ స్థానాన్ని సంపాదించుకుంది…
ఇక ఈ లిస్ట్ లో మొదట ప్రభాస్ చేరాడు. బాహుబలి మొదటి పార్ట్ తో 250 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టాడు. ఆ తర్వాత ఆయన చాలాసార్లు ఆ ఘనతను సాధించాడు. అతని తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలందరు వరుస పెట్టి ఆ రికార్డులను క్రియేట్ చేయడం విశేషం…ఇక పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సంవత్సరాల తర్వాత ఈ ఘనతను అందుకున్న స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇప్పటి వరకు 250 కోట్ల కలెక్షన్స్ ను సాధించి టాప్ 14 లో నిలిచిన సినిమాలేంటి? హీరోలేవరు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
1. బాహుబలి (ప్రభాస్)
2.బాహుబలి 2 (ప్రభాస్)
3. సాహో (ప్రభాస్)
4.అలా వైకుంఠపురం (అల్లు అర్జున్)
5.పుష్ప (అల్లు అర్జున్)
6.త్రిబుల్ ఆర్ (రామ్ చరణ్,ఎన్టీఆర్)
7.ఆది పురుషు (ప్రభాస్)
8.సలార్ (ప్రభాస్)
9.దేవర (ఎన్టీఆర్)
10. కల్కి 2898ఏడీ (ప్రభాస్)
11.హనుమాన్ (తేజ సజ్జా)
12.పుష్ప 2 (అల్లు అర్జున్)
13.సంక్రాంతికి వస్తున్నాం (వెంకటేష్)
14. ఓజీ (పవన్ కళ్యాణ్)