https://oktelugu.com/

OG Movie: ఓజీ సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన సుజీత్ పరిస్థితి ఏంటి..?

ఏకకాలంలో మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచిన స్టార్ హీరో గా కూడా పవన్ కళ్యాణ్ మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. అయితే ఇందులో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : May 4, 2024 / 05:54 PM IST

    What is Sujeeth situation if OG movie flop

    Follow us on

    OG Movie: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒకపక్క రాజకీయంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ పాలిటిక్స్ లో కీలకపాత్ర వహిస్తున్న పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ చూసుకుంటూనే, ఇటు సినిమాలపరంగా కూడా తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

    ఇక ఏకకాలంలో మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచిన స్టార్ హీరో గా కూడా పవన్ కళ్యాణ్ మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. అయితే ఇందులో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద క్లారిటీ అయితే ఉండడం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ఓ జి సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నమని మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక దానికి అనుగుణంగానే ఎట్టి పరిస్థితుల్లో అయిన అదే డేట్ కి ఈ సినిమా రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎలక్షన్స్ ముగిసిన వెంటనే అసలు రెస్ట్ అనేది లేకుండా సినిమాలకు డేట్స్ కేటాయించి షూట్స్ మొత్తం కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యం లో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా దర్శకుడు అయిన సుజీత్ మాత్రం ఓ జి సినిమాతో పక్కాగా సూపర్ హిట్ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    దానికోసం ఎన్ని అవాంతరాలైన తను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నానని సుజీత్ సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎంచుకున్న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఒకవేళ ఈ సినిమాతో కనక ఫ్లాప్ వచ్చినట్లయితే అభిమానుల చేతుల్లో సుజీత్ భారీగా ట్రోల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

    ఇక ఇంతకు ముందు కూడా సాహో సినిమాతో ప్రభాస్ కి భారీ సక్సెస్ ని అందిస్తానని చెప్పిన సుజీత్ ప్రభాస్ అభిమానుల చేతుల్లో కొంతవరకు ట్రోల్ కి గురయ్యాడు. ఇక ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…