Rahul Gandhi: రాహుల్ గాంధీకి రాయ్‌బరేలీ అంత సేఫ్ సీటు కాదేమో?

కాంగ్రెస్ వ్యూహం ఎంత వరకు కరెక్ట్.. రాహుల్ గాంధీకి రాయ్ బరేలీ అంత సేఫ్ సీటు కాదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : May 4, 2024 5:25 pm

ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. రాహుల్ గాంధీ రాయ్ బరేలిలో పోటీకి దిగుతున్నారు. అమేథీ నుంచి పారిపోయి రాహుల్ గాంధీ రాయ్ బరేలిలో తలదాచుకున్నారు. ఈ ప్రభావం కాంగ్రెస్ కు నష్టం చేస్తుందా? లాభం చేస్తుందా? అన్నది ఆలోచించాలి. పోటీ చేయాలనుకుంటే ఇంత సస్పెన్స్ అనవసరం. పోటీపై డిక్లేర్ చేయాల్సింది.

ఇక ఇదేదో వ్యూహం అనుకుంటే వయనాడ్ లో ఎన్నిక అయిపోయిన నెక్ట్స్ డే అయినా డిక్లేర్ చేయాల్సింది కదా.. మోడీ వారణాసిలో పోటీచేస్తున్నట్టు ఎప్పుడో డిక్లేర్ చేశాడు. ఇక కేజ్రీవాల్ కూడా గతంలో షీలాదీక్షిత్ పై ధైర్యంగా పోటీ చేశాడు. జనం ఇలాంటి వాటిని లైక్ చేస్తారు. ధైర్యంగా నిలబడితే జనం మెప్పు పొందుతారు.

వయనాడ్ తర్వాత రాహుల్ పోటీచేసే స్థానం అమేథి అయితే చాలా మెరుగ్గా ఉండేది. అమేథిలో పోటీ చేయకుండా రాయ్ బరేలికి రావడం పారిపోయి వచ్చాడని రాహుల్ పై ఓ అభిప్రాయం ఏర్పడింది. రాయ్ బరేలిలో ప్రియాంక గాంధీని పోటీచేయించాలి. ఆమె అక్కడ 10 ఏళ్లుగా సోనియా గాంధీ కోసం పనిచేసింది. ఇది అల్టిమేట్ గా కాంగ్రెస్ చేసింది తప్పుడు స్ట్రాటజీ అని చెప్పొచ్చు..

కాంగ్రెస్ వ్యూహం ఎంత వరకు కరెక్ట్.. రాహుల్ గాంధీకి రాయ్ బరేలీ అంత సేఫ్ సీటు కాదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.