Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో పవన్ కళ్యాణ్… ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే గత ఐదారు నెలల నుంచి ఆయన షూటింగ్ ల్లో పాల్గొనకుండా దూరం గా ఉంటున్న విషయం మనకు తెలిసిందే… ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడం వల్ల మూడు నెలలు ఆయన సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఆయన పార్టీ ఘన విజయం సాధించడంతో ఆయన సీఎం గా పదవి బాధ్యతలను చేపట్టడంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో మరొక మూడు నెలలు సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చాడు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఆయన అమ్మవారి మాల వేసుకున్నాడు. కాబట్టి సినిమా షూటింగ్ లకు మరోసారి బ్రేక్ ఇచ్చాడు. ఇక హరిహర వీరామల్లు పూర్తయిన తర్వాత అవుట్ అండ్ ఔట్ సినిమా మీద తన పూర్తి డేట్స్ ని కేటాయించడానికి చూస్తున్నాడు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ కనక చూసినట్టయితే అది అవుట్ అండ్ అవుట్ హై వోల్టేడ్ టీజర్ గా కనిపిస్తుంది. అందులో పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత మరోసారి తన ఆటిట్యూడ్ మొత్తాన్ని బయటపెట్టి ఒక కొత్త ఫ్లేవర్ తో ఈ సినిమాని చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా విషయంలో సుజీత్ చాలా జాగ్రత్తలు తీసుకొని మరి సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన ప్రభాస్ తో చేసిన సాహో సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. కాబట్టి ఇప్పుడు చేయబోతున్న సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు సాగుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు.
ఆయన గత కొద్ది రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మళ్లీ ముంబై సామ్రాజ్యాన్ని ఎలడానికి వస్తాడు. ఆ వ్యక్తి ముంబైలో ఉంటే మరోసారి ఎలాంటి విద్వాంసాన్ని సృష్టించాడు అనేది సినిమా అవుట్ లైన్ గా తెలుస్తోంది. అలాగే మాఫియా డాన్ గా పవన్ కళ్యాణ్ తన నట విశ్వరూపం చూపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు అనేది…