https://oktelugu.com/

Mahesh Babu: యానిమల్ లో మహేష్, కృష్ణ నటిస్తే వేరే లెవల్లో ఉండు.. బాక్సాఫీస్ బద్దలవ్వు.. ఈ వీడియోనే సాక్ష్యం

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ యానిమల్ లో మహేష్ బాబు-కృష్ణ నటిస్తే ఎలా ఉంటుంది. ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా. యానిమల్ చిత్రంలోని తండ్రి కొడుకుల పాత్రలు మహేష్,కృష్ణ చేస్తే ఎలా ఉంటుందో మచ్చుకకు చిన్న వీడియో వదిలారు. అది సోషల్ మీడియాలో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : September 24, 2024 / 05:21 PM IST

    Mahesh Babu(5)

    Follow us on

    Mahesh Babu: దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ ఇండస్ట్రీని షేక్ చేసింది. రన్బీర్ కపూర్-రష్మిక మందాన జంటగా నటించారు. ఈ చిత్రంలో పాత్రలను సందీప్ రెడ్డి చాలా వైల్డ్ గా డిజైన్ చేశాడు. ముఖ్యంగా హీరో, విలన్ రోల్స్ ఇంటెన్సిటీతో కూడుకుని ఉంటాయి. తండ్రిని పిచ్చిగా ప్రేమించే కొడుకు… ఆయన ప్రాణాలు తీయాలని చూసినవాళ్ల అంతు చూస్తాడు. యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 900 కోట్ల గ్రాస్ రాబట్టింది.

    రన్బీర్ కపూర్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా యానిమల్ నిలిచింది. అదే సమయంలో యానిమల్ విపరీతంగా విమర్శలు ఎదుర్కొంది. ఈ చిత్రంలోని కంటెంట్ పై పలువురు చిత్ర ప్రముఖులు విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ వేదిక ఓ మహిళా ఎంపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్ని విమర్శలు వచ్చినా.. యానిమల్ సక్సెస్ ని ఎవరూ ఆపలేకపోయారు.

    కాగా యానిమల్ మూవీ మహేష్ బాబు చేసి ఉంటే ఎలా ఉంటుంది. ఓ వీరాభిమానికి ఈ ఆలోచన వచ్చింది. తండ్రిని అమితంగా ప్రేమించే మహేష్ బాబు కృష్ణతో కలిసి ఈ చిత్రం చేస్తే అద్భుతంగా ఉండేది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యేవన్న వాదన తెరపైకి వచ్చింది. యానిమల్ మూవీలోని ఒక ఐకానిక్ సీన్ ని మహేష్ బాబు, కృష్ణల ఫేస్ తో మార్ప్ చేసి వీడియో వదిలారు.

    అనిల్ కపూర్ పై అటాక్ జరిగిందని తెలిసి విదేశాల్లో ఉన్న రన్బీర్ కపూర్ ఇండియాకు వస్తాడు. వచ్చిన వెంటనే తండ్రిని కలుస్తాడు. ఈ సీన్ లో మహేష్, కృష్ణ నటించినట్లు ఎడిట్ చేసి వీడియో విడుదల చేయగా… సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా మహేష్ బాబుతో మూవీ చేయాలని సందీప్ రెడ్డి వంగ ప్రయత్నం చేశాడు. కానీ వీరి కాంబో కార్యరూపం దాల్చలేదు. బహుశా సందీప్ రెడ్డి వంగ పవన్ కళ్యాణ్ తో యానిమల్ చేద్దామని అనుకున్నాడేమో.

    ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29కి సిద్ధం అవుతున్నాడు. ఆయన లుక్ ఈ చిత్రంలో సరికొత్తగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. మహేష్ బాబు లాంగ్ హెయిర్, గడ్డం పెంచాడు. ఎస్ఎస్ఎంబి 29కి రాజమౌళి దర్శకుడన్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు అని సమాచారం.

    ఎస్ఎస్ఎంబి 29 జంగిల్ అడ్వెంచర్ డ్రామా. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ బాబు పాత్ర ఉంటుందట. ఈ చిత్రంలో హాలీవుడ్ నటులు సైతం భాగం కానున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు మూడేళ్లు కేటాయించారట.