Unacademy CEO Gaurav Munjal : JEE పాస్ కాలేదు.. కానీ కోల్డ్ ప్లే టికెట్ తగ్గించుకున్నాను.. ఓ కంపెనీ సీఈఓ ఉత్సాహం ఎలా ఉందో చూడండి..

కోల్డ్ ప్లే అనేది ఒక మ్యూజిక్ రాక్ బ్యాండ్. ఇది లండన్ లో 1997లో ఏర్పడింది. ఇందలుో పియానిస్ట్ క్రిస్ మార్టిన్, గిటారిస్ట్ జానీ బక్ ల్యాండ్, బాసిస్ట్ గై బెర్రీ మాన్, డ్రమ్మర్, పెర్ఖషన్ వాద్య కారుడు ఛాంపియన్ ఉన్నారు. వీరి ప్రదర్శన ఉర్రూతలూగిస్తుంది. వీరు కలిసి చేసిన ఆల్బమ్ లో ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా అమ్ముడుపోయాయి.

Written By: Srinivas, Updated On : September 24, 2024 5:21 pm

Unacademy CEO Gaurav Munjal

Follow us on

Unacademy CEO Gaurav Munjal : Ed Tech Platform Unacademy CEO గౌరవ్ ముంజల్ ఇటీవల వార్తల్లోకెక్కాడు. ఇటీవల ఆయన కోల్డ్ ప్లేకు సంబంధించిన టికెట్లను పొందాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెబుతూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఎంతో డిమాండ్ కలిగిన ఈ టికెట్లు తాను సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఉత్సాహంగా చెప్పాడు. అంతేకాకుండా కోల్డ్ ప్లే టికెట్ ను పొందడం ఐఐటీ జేఈఈ లో పాస్ అయినంత ఆనందంగా ఉందని చెప్పాడు. తాను ఐఐటీ జెయియి పాస్ కాలేదని, కానీ ఈ టికెట్లు పొందడం ద్వారా ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. ఒక కంపెనీ సీఈవో అయిన గౌరవ్ ముంజల్ ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణమేంటి? కోల్డ్ ప్లే అంటే ఏమిటీ?

కోల్డ్ ప్లే అనేది ఒక మ్యూజిక్ రాక్ బ్యాండ్. ఇది లండన్ లో 1997లో ఏర్పడింది. ఇందలుో పియానిస్ట్ క్రిస్ మార్టిన్, గిటారిస్ట్ జానీ బక్ ల్యాండ్, బాసిస్ట్ గై బెర్రీ మాన్, డ్రమ్మర్, పెర్ఖషన్ వాద్య కారుడు ఛాంపియన్ ఉన్నారు. వీరి ప్రదర్శన ఉర్రూతలూగిస్తుంది. వీరు కలిసి చేసిన ఆల్బమ్ లో ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా అమ్ముడుపోయాయి. వీటిలో అత్యధికంగా ‘కోల్డ్ ప్లే’ సంగీతం ఎక్కువగా విక్రయించబడింది. అంతేకాకుండా ఈ అల్బమ్ పలు అవార్డులను కూడా గెలుచుకుంది. అంతేకాకుండా బ్రిటన్ లో అత్యధికంగా అమ్ముడు పోతున్న మ్యూజిక్ బ్యాండ్ లో వీరి అల్బమ్ ఉంది.

2025లో భారత్ లో కోల్డ్ ప్లే మ్యూజిక్ ను ప్రదర్శించనున్నారు. ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జనవరి 18, 19 నిర్వహించే ఈ ప్రదర్శన టికెట్లను బుక్ మై షో ద్వారా విక్రయిస్తున్నారు. అయితే దీని విక్రయాలు ప్రారంభించిన సమయంలో కాస్త కొనుగోలుదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఆ తరువాత చాలా మంది వీటిని దక్కించుకున్నారు. ఈ టిక్కెట్ల ధరలు రూ.2,500 నుంచి రూ. 12,500 వరకు ఉన్నాయి. ఇవి ఆయా తరగతులను బట్టి నిర్ణయించారు.

బెంగుళూరులోని ప్రముఖ Ed Tech Platform Unacademy CEO గౌరవ్ ముంజల్ ఈ టికెట్ ను దక్కించుకోవడం గొప్ప వరం అని భావించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖతాలో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ‘JEE క్లియర్ కాలేదు. కానీ ఈరోజు నేను కోల్డ్ ప్లే టిక్కెట్లు పొందాను. ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది.’ అని చెప్పాడు. దీంతో తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన తరువాత చాలా మంది ఆయనకు రిప్లై ఇస్తున్నారుే.

కోల్డ్ ప్లే టికెట్ల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అలాంటిది మీరు టికెట్ దక్కించుకోవడం గ్రేట్ అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే జనవరి నాటికి ఈ టికెట్లకు డిమాండ్ ఉన్నందున చాలామంది ఇప్పుడే బుక్ చేసుకుంటున్నారు. అయితే కోల్డ్ ప్లే ప్రదర్శన ఎంతటి ఉత్సాహాన్నిస్తుందో చూడాలి. అలాగే ఈ టికెట్లు ఎంతమంది దక్కించుకుంటారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కోల్డ్ ప్లేస్ షో చూడాలంటే జనవరి వరకు ఆగాల్సిందే.