Nagababu health updates: మెగా బ్రదర్ గా నాగబాబు(Nagababu Konidela) కి మెగా అభిమానుల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు అభిమానులకు మధ్య వారధిగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది నాగబాబు మాత్రమే. సినిమాల్లో హీరో గా కొన్ని సినిమాల్లో చేసాడు కానీ, ఎందుకో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి రేంజ్ కి ఎదిగాడు. నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించాడు కానీ, అవి ఆయనకు పెద్దగా లాభాలు తెచ్చిపెట్టకపోగా, భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. అందుకే నిర్మాతగా రిటైర్ అయ్యాడు, అప్పుడవుప్పుడు ప్రస్తుతం సినిమాల్లో మరియు కొన్ని టీవీ షోస్ లో కనిపిస్తున్నాడు కానీ, ఒకప్పుడు ఉన్నంత యాక్టీవ్ గా మాత్రం లేడని అనిపిస్తుంది. నాగబాబు చూసేందుకు చాలా అందంగా ఉంటాడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కంటే భారీ కటౌట్.
ఎంతో డైనమిక్ గా కనిపించే నాగబాబు ఈమధ్య కాలంలో బలహీనంగా కనిపిస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యామిలీ వీకెండ్ ఎపిసోడ్ లో తన శిష్యుడు, ఆప్తుడు భరణి కోసం వస్తాడు. ఇక్కడ నాగబాబు సన్నగా చిక్కిపోయి, ఎలా ఉండేవాడు, ఎలా అయ్యాడు అన్నట్టుగా ఆడియన్స్ నాగబాబు ని చూసి సోషల్ మీడియా లో జాలి పడ్డారు. అంతేకాకుండా ఆయన నడక కూడా చాలా నిదానం గా ఉంటుంది. ఇదంతా చూసిన ఫ్యాన్స్ అసలు నాగబాబు ఆరోగ్యానికి ఏమైంది?, ఎందుకు ఇలా నడుస్తున్నాడు, ఎందుకు ఇంత బలహీనంగా కనిపిస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున పోస్టులు పడుతున్నాయి. దీనికి స్వయంగా నాగబాబు నే వివరణ ఇవ్వాలి. కానీ కెరీర్ పరంగా, కుటుంబం పరంగా ప్రస్తుతం నాగబాబు ని మించిన సంతోషమైన వ్యక్తి మెగా ఫ్యామిలీ లో ఎవ్వరూ ఉండరు.
ఎందుకంటే ఆయన ప్రస్తుతం శాసన మండలి లో MLC గా కొనసాగుతున్నాడు. అంతే కాకుండా కొడుకికి వరుణ్ తేజ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాడు. కూతురు నిహారిక కెరీర్ పరంగా మొట్టమొదటి సక్సెస్ చూసింది. ఇక రేపో మాపో నాగబాబు ఆంధ్ర ప్రదేశ్ లో క్యాబినెట్ మినిస్టర్ గా కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా ఎటు చూసుకున్నా ఆయన మనసు ఎంతో సంతోషించే విషయాలే జరుగుతున్నాయి. మనిషికి సంతోషమే సగం బలం అని అంతా అంటుంటారు. కానీ నాగబాబు ఎందుకు అంత బలహీనంగా కనిపిస్తున్నాడు?, ఆయనకు నిజంగానే ఆరోగ్య సమస్య ఉందా?, లేదంటే వర్కౌట్స్ చేసి శరీరాన్ని తగ్గించడం వల్ల మనకి అలా అనిపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.