Kalvakuntla Kavitha Saree: ప్రజా జీవితంలో ఉన్నప్పుడు.. నాయకులు చేసే ప్రతీ పనిని ప్రజలు గమనిస్తుంటారు. సోషల్ మీడియా వచ్చాక అంతరంగంలోని విశయాలను కూడా తవి వెలికి తీసి సోషల్ మీడియోలో వైరల్ చేస్తున్నారు. అందుకే నేతలు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇక నేతలు చేసే ప్రతీ పనికి అర్థం ఉంటుంది. తాజాగా కల్వకుంట్ల కవిత కట్టుకున్న చీర ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
భట్టి కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు..
కల్వకుంట్ల కవితను ఇటీవలే బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని, సొంత పార్టీపై, పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని వేటు వేశారు. స్వయానా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూతురు అయిన కవిత.. బయటకు వచ్చి.. జాగృతి పేరుతో జనం బాట పట్టారు.. జనమే లేని బాట చేస్తున్నారు. ఇక ఆమె తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తనయుడి నిశ్చితార్థానికి ప్రజాభవన్‌కు భర్త అనిల్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కట్టుకున్న చీర మూడు రంగులు.. అదీ కాంగ్రెస్ చీరను పోలి ఉంది. దీనికి సబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా రంగుల సారీస్ ధరించే కవిత ఈసారి సంపూర్ణంగా తెలుపు రంగు సారీలో, ఎరుపు–ఆకుపచ్చ బార్డర్ చీర ధరించడమే చర్చకు కారణమైంది.
రాజకీయ సంకేతాలుగా..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నేటిజన్లు, బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. ఈ చీర ద్వారా తాను కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నట్లు కవిత సంకేతం ఇచ్చారని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. బీఆర్‌ఎస్‌కు శాశ్వతంగా దూరం అవుతున్నారని కామెంట్ చేస్తున్నారు. కొందురు మరో షర్మిల కాబోతున్న కవిత అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
భట్టి ఇంటి నిశ్చితార్థంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న తెలంగాణ జాగృతీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కవిత ధరించిన మూడు రంగుల చీర ఈవెంట్‌కు మరింత ఆకర్షణను తీసుకొచ్చింది.#Kavitha #TelanganaJagruthi #Bhatti pic.twitter.com/FsbXvt4icM
— TelanganaDaily (@telanganadaily9) November 27, 2025