https://oktelugu.com/

Surender Reddy : డైరెక్టర్ సురేందర్ రెడ్డి అసలు ఏమయ్యాడు..? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు!

టాలీవుడ్ లో మంచి టాలెంట్ మరియు క్రియేటివిటీ ఉన్నటువంటి దమ్మున్న డైరెక్టర్స్ లో ఒకరు సురేందర్ రెడ్డి.

Written By:
  • Vicky
  • , Updated On : December 26, 2024 / 08:11 AM IST

    Surender Reddy

    Follow us on

    Surender Reddy : టాలీవుడ్ లో మంచి టాలెంట్ మరియు క్రియేటివిటీ ఉన్నటువంటి దమ్మున్న డైరెక్టర్స్ లో ఒకరు సురేందర్ రెడ్డి. తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్ జిల్లా, మచనపల్లి గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి అప్పర్ మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వ్యక్తి. ఈయన తండ్రి వీరా రెడ్డి సర్పంచ్ గా కూడా పని చేసాడు. చిన్నప్పటి నుండి సినిమాల మీద పిచ్చి ఉన్నటువంటి ఈయన తన గ్రాడ్యుయేషన్ ని మధ్యలోనే వదిలేసి సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ కి వచ్చాడు. అందరి లాగానే ఈయన కూడా అవకాశాల కోసం చాలా కష్టాలే పడాల్సి వచ్చింది. అలా ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఈయనకి 1999 వ సంవత్సరం లో విడుదలైన ప్రేమించేది ఎందుకమ్మా అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఈయన, 2005 వ సంవత్సరం లో ‘అతనొక్కడే’ సినిమా ద్వారా డైరెక్టర్ గా మారే అవకాశం దక్కింది.

    కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఒక ప్రభంజనం. తమిళం లో విజయ్ హీరో గా నటించిన ‘ఆది’ అనే సూపర్ హిట్ చిత్రానికి ఇది రీమేక్. కళ్యాణ్ రామ్ సురేందర్ రెడ్డి లోని టాలెంట్ ని గమనించి అతనొక్కడే సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక సురేందర్ రెడ్డి వెంట మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ పడ్డారు.
    తన అన్నయ్య కళ్యాణ్ రామ్ కి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడని ఎన్టీఆర్ వెంటనే తనతో ‘అశోక్’ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావేరేజ్ రేంజ్ లో ఆడింది. ఈ చిత్రం తర్వాత ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘అతిథి’ అనే చిత్రం చేసాడు. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ సురేందర్ రెడ్డి కి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

    కానీ సురేందర్ రెడ్డి మాత్రం కాస్త గ్యాప్ తీసుకొని మాస్ మహారాజా రవితేజ తో కిక్ అనే చిత్రం తో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి తో ఒక్కసారైనా కలిసి పని చెయ్యాలి అనే కోరిక మన టాలీవుడ్ హీరోలకు కలిగింది. ఈ చిత్రం తర్వాత ఆయన తీసిన సినిమాలలో ‘రేస్ గుర్రం’, ‘ధ్రువ’, ‘సైరా నరసింహా రెడ్డి’ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ గత ఏడాది ఈయన నుండి విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత సురేందర్ రెడ్డి ఎక్కువగా రియల్ ఎస్టేట్ బిజినెస్ పై ఫోకస్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా ఖరారు అయ్యింది. ఫైనల్ స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఓకే అంటే, అప్పుడు ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది.