Tollywood : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా కొనసాగిన వాళ్ళు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్లు గా మారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఏదైనా ఇంటర్వ్యూ లో వీళ్ళు బాలనటులు అని తెలిసినప్పుడు మనం షాక్ కి గురైన సందర్భాలు చాలా ఉంటాయి. అలా ‘గోల్కొండ హై స్కూల్’ చిత్రం లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈ బుడ్డోడు మీ అందరికీ గుర్తు ఉండే ఉంటాడు. చురుకైన మాటలతో చిన్నప్పుడే ప్రేక్షకులను ఈ కుర్రాడు విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇతను ఒక ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు. ఆ డైరెక్టర్ ప్రభాస్ తో కూడా ఒక సూపర్ హిట్ సినిమాని తీసాడు. అంతే ఈ బుడ్డోడి అన్నయ్య కూడా ఇండస్ట్రీ లో హీరోగా కొనసాగుతున్నాడు. రీసెంట్ గా విడుదలైన ఒక చిత్రం లో ఈ బుడ్డోడు చేసిన కామెడీ కి సినిమా బంపర్ హిట్ అయ్యింది. త్వరలోనే ఆ సినిమాకి పార్ట్ 2 కూడా రాబోతుంది. ఆ బుడ్డోడు మరెవరో కాదు, సంగీత్ శోభన్.
రెబల్ స్టార్ ప్రభాస్ తో వర్షం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని తీసిన డైరెక్టర్ శోభన్ కొడుకు ఇతను. ఇతని సోదరుడు సంతోష్ శోభన్ కూడా ఒక హీరోనే. ఇప్పటి వరకు ఆయన సరైన బ్లాక్ బస్టర్ కొట్టలేదు కానీ, మంచి నటుడిగా మాత్రం పేరు తెచుకున్నాడు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ఈయన ‘మ్యాడ్’ చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఆ సినిమా కమర్షియల్ గా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా సంగీత్ శోభన్. అంతకు ముందు కూడా ఈయన పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసాడు కానీ, గుర్తింపు రాలేదు. మ్యాడ్ చిత్రం ద్వారానే ఆయనకీ బోలెడంత క్రేజ్ వచ్చింది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, ది బేకర్ & బ్యూటీ, 3 రోజెస్ , ప్రేమ విమానం వంటి సినిమాల్లో నటించాడు అంతకు ముందు నటించాడు.
త్వరలోనే ఈయన మ్యాడ్ 2 చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకున్నారు కానీ, బాలయ్య తన ‘డాకు మహారాజ్’ చిత్రం ఎట్టి పరిస్థితిలోనూ సంక్రాంతి బరిలో ఉండాలని నిర్మాత నాగ వంశీ కి బలంగా చెప్పడంతో వేరే గత్యంతరం లేక మ్యాడ్ 2 ని వాయిదా వేసాడు. ఈ రెండు చిత్రాలకు నిర్మాత ఆయనే. సంగీత్ శోభన్ ఈ చిత్రం తర్వాత పెద్ద కమెడియన్ అవుతాడని అనుకుంటే, ఆయనకీ ఎక్కువగా హీరో అవకాశాలే వస్తున్నాయట. అది కూడా పెద్ద ప్రొడక్షన్ బ్యానర్స్ నుండి అట. రాబోయే రోజుల్లో ఇతను కూడా మరో నవీన్ పోలిశెట్టి అవుతాడేమో చూడాలి.