Allari Naresh : తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులను సరికొత్తగా అలరించేందుకు ప్రయత్నాలు చేసి విఫలం అవుతూనే ఉన్నాడు అల్లరి నరేష్. ప్రతీ చిత్రంలోని తనలోని అద్భుతమైన నటన బయటకి తీసి ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాడు కానీ, డైరెక్టర్స్ మాత్రం ఆయనకీ సహకరించడం లేదు. ఒక మంచి స్టోరీ దొరికితే అల్లరి నరేష్ కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ బ్లాక్ బస్టర్ ఇచ్చే డైరెక్టరే దొరకడం కష్టమైంది పాపం అల్లరి నరేష్ కి. రీసెంట్ గా ఆయన నటించిన ‘బచ్చల మల్లి’ టీజర్, ట్రైలర్ వంటివి చూసి ప్రేక్షకులు కచ్చితంగా ఈ చిత్రంతో అల్లరి నరేష్ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడు అనుకున్నారు. కానీ గత సినిమాలకు పట్టిన గతే ఈ చిత్రానికి పట్టింది. మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఆరు రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టిందో చూద్దాం.
విడుదలకు ముందు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 5 కోట్ల రూపాయలకు జరిగింది. మొదటి రోజు కేవలం 50 లక్షల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు 45 లక్షలు, మూడవ రోజు 48 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. మొత్తం మీద మూడు రోజులకు కోటి 43 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఇది చాలా అంటే చాలా తక్కువ. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం. సోమవారం, మంగళవారం కి కలిపి ఈ సినిమాకి కేవలం 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇక క్రిస్మస్ రోజు అయినా ఈ చిత్రాన్ని కాస్త ఆదుకుంటుంది అనుకుంటే, ఆరోజు కూడా పెద్దగా వసూళ్లు రాలేదు.
దీంతో ఈ చిత్రం రెండు కోట్ల రూపాయిల లోపే షేర్ వసూళ్లను దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అల్లరి నరేశ్ కెరీర్ లో మరో భారీ డిజాస్టర్ గా ఈ చిత్రం నిలిచిపోయింది. దీంతో అల్లరి నరేష్ ని అభిమానించే వాళ్ళు, మళ్ళీ కామెడీ రూట్ లోకి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘బచ్చల మల్లి’ ప్రొమోషన్స్ సమయంలో త్వరలోనే ‘సుడిగాడు 2 ‘ చిత్రంతో మీ ముందుకు రాబోతున్నాను అని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం లో లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమాల స్పూఫ్స్ ని చేయబోతున్నారట. పొట్ట చెక్కలు అయ్యే కామెడీ ని అందిస్తామని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమా తో అల్లరి నరేష్ భారీ కం బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. సుడిగాడు చిత్రం ఆ రోజుల్లోనే 20 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. ‘సుడిగాడు 2 ‘ ఇప్పుడున్న మార్కెట్ ని బట్టి చూస్తే 40 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టే అవకాశాలు