Varun Tej – Lavanya Tripathi : రీసెంట్ గానే వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి జంటకి నిశ్చితార్ధమైన సంగతి మన అందరికీ తెలిసిందే. నాగబాబు ఇంట్లో బంధు మిత్రుల సమక్ష్యం లో వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ తో పాటుగా, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ కూడా పాల్గొన్నది. పెళ్లి ఎప్పుడు ఏమిటి అనే విషయం ఇంకా ఖరారు కాలేదు కానీ, ఈ జంట ఇద్దరు అప్పుడే హనీమూన్ ట్రిప్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
నిశ్చితార్థం జరిగిన వెంటనే విదేశాలకు వెళ్లిపోయిన ఈ ప్రేమ పక్షులు అక్కడ నగర వీధుల్లో తిరుగుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరైనా పెళ్లి జరిగిన తర్వాత ఇలాంటి ట్రిప్స్ వేస్తారు, కానీ మీరేంటి పెళ్లి కాకముందే అన్నీ కానిచ్చేస్తున్నారు ?, మరీ ఇంత అడ్వాన్స్ గా ఉంటే ఎలా, చూసేవాళ్ళు తప్పుగా అనుకోరు ? అని మెగా ఫ్యాన్స్ కొంతమంది సోషల్ మీడియా లో వరుణ్ తేజ్ పోస్టుల క్రింద కామెంట్స్ పెడుతున్నారు.
అయితే ఇలా వీళ్లిద్దరు విదేశాల్లో ప్రైవేట్ గా తిరుగుతుండడం ఇప్పుడు మనం చూస్తున్నాము, కానీ వాళ్ళు గతం లో ఎన్నో సార్లు వెళ్లి ఉంటారు, అయినా అదంతా పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత విషయం. వాళ్ళ సంగతి మీకు ఎందుకు, మీ పని మీరు చూసుకోండి అంటూ ట్రోల్ చేసే వారిపై విరుచుకుపడుతున్నారు కొంతమంది మెగా ఫ్యాన్స్. ఇక పోతే రీసెంట్ గా వరుణ్ తేజ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కాఫీ ఫోటో ని పెద్దగా ఫోకస్ చేస్తూ, బ్లర్ లో లావణ్య త్రిపాఠి దాని ఎదురుగా కూర్చున్నట్టుగా చూపించి హార్ట్ ఎమోజి ని వేస్తాడు.
లావణ్య త్రిపాఠి కూడా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ వరుణ్ తేజ్ ఫోటో పెట్టి అదేమాదిరిగా స్టోరీ షేర్ చేసింది. అలా వీళ్లిద్దరి ఆన్లైన్ రొమాన్స్ ని చూసి అంభిమానులు ఎంతగానో మురిసిపోయారు. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ జంట పెళ్లి వేడుక కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.