Sitara Birthday : బర్త్ డే రోజు సితార చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..!

కాగా సితార ఈ బర్త్ డే పేద చిన్నారులతో కలిసి జరుపుకున్నారు. బాలికల మధ్య కేక్ కట్ చేశారు. వారితో ముచ్చటించారు. చిన్నారులు సైతం సితారను కొన్ని ఆసక్తికర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. సితార ఇటీవల పేద విద్యార్థులకు సైకిల్స్ కొనిచ్చారు.

Written By: Shiva, Updated On : July 20, 2023 1:44 pm
Follow us on

Sitara Birthday : చిచ్చర పిడుగు సితార ఘట్టమనేని నేడు 11వ ఏట అడుగు పెట్టింది. మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సితార ఈ బర్త్ డే పేద చిన్నారులతో కలిసి జరుపుకున్నారు. బాలికల మధ్య కేక్ కట్ చేశారు. వారితో ముచ్చటించారు. చిన్నారులు సైతం సితారను కొన్ని ఆసక్తికర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. సితార ఇటీవల పేద విద్యార్థులకు సైకిల్స్ కొనిచ్చారు. వారు స్కూల్ కి వెళ్లేందుకు సైకిళ్ళ రూపంలో సదుపాయం కల్పించారు. 

 
ఈ సైకిళ్ళు సితార సొంత సంపాదనతో సమకూర్చడం విశేషం. సితార ఆల్రెడీ సోషల్ మీడియా సెలబ్రిటీ. అలాగే ప్రమోషన్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. సితార గతంలో తండ్రి మహేష్ బాబుతో కలిసి సీరియల్స్ ప్రమోషనల్ యాడ్స్ లో నటించారు. జీ తెలుగు మహేష్ బాబు-సితారతో ఒక ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా అమ్మాయిగారు, పడమటి సంధ్యారాగం వంటి సీరియల్స్ ని మహేష్, సితార ప్రమోట్ చేశారు. 
 
ఇటీవల సోలోగా ఓ యాడ్ చేసింది. ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ పీఎంజే సితారను ప్రచారకర్తగా ఎంచుకుంది. దీనికి గానూ సితార కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. పదేళ్ల ప్రాయంలో కోటి రూపాయలు అవలీలగా సంపాదించేసింది సితార. అయితే ఈ డబ్బులను సితార చారిటీకి ఇచ్చేశారట. సేవా కార్యక్రమాలకు ఖర్చు చేశారట. ఆ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పింది. నా ఫస్ట్ రెమ్యూనరేషన్ చారిటీకి ఇచ్చానని సితార వెల్లడించారు. 
 
పీఎంజే సంస్థ సితారతో కూడిన హోర్డింగ్స్ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్  లో ప్రదర్శించడం విశేషం. ఎంతో ఘన చరిత్ర కలిగిన టైమ్ స్క్వేర్ స్ట్రీట్ లో సితార ఫోటోలు కనిపించడం అరుదైన విషయం. మహేష్, నమ్రత ఇందుకు మురిసిపోయారు. కాగా సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్ధం అంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ చేయనున్న మూవీలో సితార, ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్స్ గా నటిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.