Pawan Kalyan OG Movie Remuneration: చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్… ఈయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. యూత్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఒక ఒకానొక సందర్భంలో చిరంజీవి కంటే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోలు ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఇలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే అవకాశం వచ్చిన ప్రతిసారి సినిమాలను చేస్తూ తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులనే కాకుండా ఇండియన్ సినిమా ప్రేక్షకులను కూడా మెప్పిస్తున్నాడు. ఈ సినిమాతో ఇప్పటికే 350 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఆయన లాంగ్ రన్ లో ఎంతటి వసూళ్లను సంపాదిస్తాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ లాంటి నటుడి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి… ఇక ఓజీ సినిమా కోసం ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ ని కౌలు రైతుల కోసం కేటాయించాడు. ఇక వివరాల్లోకి వెళితే గత రెండు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు అప్పుల బాధను భరించలేక చనిపోయారు.
ఇక ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వల్ల కుటుంబానికి అండ గా నిలవడానికి పూనుకున్నాడు. అందుకే వాళ్ళకు ఆర్థిక సహాయం అందించాలని చూశాడు. కానీ తనదగ్గర అంత మణి లేకపోవడంతో ఓజీ సినిమా ప్రొడ్యూసర్ అయిన దానయ్య దగ్గర నుంచి రెమ్యూనరేషన్ మొత్తాన్ని తీసుకొని వాళ్లకోసం కేటాయించడట…
ఇక పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ మొత్తాన్ని ప్రతిసారి ఎవరో ఒకరికి సహాయంగా అందిస్తూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా విషయంలో ఆయన తన రెమ్యూనరేషన్ ను అలాంటి ఒక గొప్ప పని కోసం కేటాయించాడు అనే విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగా గర్వపడుతున్నారు.
మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి పనిలో ఏదో ఒక అర్థం ఉంటుంది అని చెప్పడానికి దీనిని మనం ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు… ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం నువ్వు దేవుడు స్వామి అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు…