Krishna and Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరూ వారసత్వపరంగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే కావడం విశేషము. అయితే నెపోటిజం అనేది ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఎవరికి వారు వాళ్ళ సత్తాను చాటుతూ ముందుకు దూసుకెళ్తేనే ఇక్కడ ఎక్కువ కాలం పాటు స్టార్ హీరోలుగా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇప్పటికీ ఇండియా హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళందరూ వారసత్వ పరంగా వచ్చిన వాళ్ళు కావడం విశేషం…
మెగాస్టార్ చిరంజీవికి సినిమా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపైతే ఉంది. ఆయనతో సినిమా చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు ఎదురుచూస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి చిరంజీవి తన తమ్ముడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీకి తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక కెరియర్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లాడు. ఇలాంటి సందర్భంలోనే ఆయన చేసిన తొలిప్రేమ, ఖుషి లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ లను కూడా సాధించాయి. అయితే ఈ మూడు సినిమాలను చూసిన కృష్ణ మహేష్ బాబుతో నువ్వు కూడా ఇలాంటి కమర్షియల్ సినిమాలను ఎంచుకొని వరుస సక్సెస్ లను సాధిస్తే ఈజీగా స్టార్ హీరో అవుతావు అని చెప్పారట. దానివల్లే మహేష్ బాబు కూడా కమర్షియల్ జానర్ లోనే సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ వచ్చాడు. ఇక ఎట్టకేలకు సూపర్ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా మంచి కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి.
ఇక కృష్ణ చెప్పిన ఆ మాటలని అప్పటినుంచి ఇప్పటివరకు తూచ తప్పకుండా ఫాలో అవుతూ వస్తున్న మహేష్ బాబు ఇప్పటికీ కమర్షియల్ సినిమాలని చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టార్ డమ్ నైతే సంపాదించుకున్నాడో మహేష్ బాబు కూడా అంతటి గొప్ప స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఇప్పుడు ఆయన రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి దానికి సంబంధించిన తీవ్రమైన కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అనేది తెలియాలంటే మాత్రం రాజమౌళి ఈ సినిమా మీద స్పందించాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్స్ మొత్తాన్ని వెతికి పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాదాపు 17 దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…