Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనేది నిన్న మొన్నటి వరకు చెప్పలేకపోయేవారు. ఎందుకంటే నిఖిల్, గౌతమ్ మధ్య చాలా టఫ్ ఫైట్ నడిచింది. కచ్చితంగా వీరిలో ఎవరో ఒకరు టైటిల్ కొడుతారు అని అనుకున్నారు కానీ, ఎవరు కొట్టబోతున్నారు అనేది మాత్రం చెప్పలేకపోయేవారు. ఎందుకంటే ఒక రోజు నిఖిల్ టాప్ లో ఉంటే మరో రోజు గౌతమ్ టాప్ లో ఉండేవాడు. అయితే చివరి రెండు వారాలు విన్నర్ ని నిర్ణయించే వారాలు అని ఇది వరకు టెలికాస్ట్ అయిన ప్రతీ సీజన్ లోనూ చూసాము. ఈసారి కూడా అదే జరిగింది. సోమవారం జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ లో నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన పెద్ద గొడవ గౌతమ్ కి బాగా నెగటివ్ అయ్యింది. నిఖిల్ బరితెగించి మాట్లాడాడు, గౌతమ్ దారుణంగా నోరు జారాడు, దీంతో గౌతమ్ కి కాస్త నెగటివిటీ పడింది.
ఎలాంటి సందర్భం కలిసిరాక పోయినా కూడా టాప్ ఓటింగ్ తో దూసుకెళ్లే నిఖిల్, ఈసారి ఇలాంటి ఎపిసోడ్ పడితే ఎందుకు ఆగుతాడు. ప్రస్తుతం అందరికంటే టాప్ ఓటింగ్ తో నిఖిల్ కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రెండవ స్థానంలో గౌతమ్, మూడవ స్థానం లో ప్రేరణ, నాల్గవ స్థానం లో రోహిణి ఉన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం రోహిణి ఓటింగ్ సోషల్ మీడియా పోల్స్ లో తక్కువగానే ఉంది కానీ, అధికారిక ఓటింగ్స్ లో ఆమెకు ప్రేరణ కంటే ఎక్కువ ఓటింగ్ ఉందని, మూడవ స్థానంలో ఉన్నారని చెప్తున్నారు. ఇక చివరి రెండు స్థానాల్లో నబీల్, విష్ణు ప్రియా ఉన్నారు. ఒకప్పుడు నబీల్ ఓటింగ్ ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక సందర్భంలో ఆయన నిఖిల్ ని కూడా దాటేసిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి నబీల్ గ్రాఫ్ ఇప్పుడు దారుణంగా పడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ స్థాయి అనూహ్యమైన మార్పులు ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు.
ఇక విష్ణు ప్రియ అందరికంటే చివరి స్థానంలో ఉంది, డబుల్ ఎలిమినేషన్ పెడితే నబీల్, విష్ణు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. కానీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం విష్ణు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఎవరు వెళ్ళబోతున్నారు అనేది. అయితే గత సీజన్ లో టాప్ 6 ఉండేవారు. ఈ సీజన్ లో కూడా టాప్ 6 ఉంటారు అనే టాక్ ఉంది. అదే నిజమైతే విష్ణు ఎలిమినేషన్ ని ఖాయం చేసుకోవచ్చు. ఎలాంటి గేమ్ ఆడకుండా ఆమె ఇన్ని రోజులు హౌస్ లో ఉండడమే ఒక అద్భుతం అని సోషల్ మీడియా లో ఆడియన్స్ ఇప్పటికీ అంటూనే ఉన్నారు. గత వారం పృథ్వీ కి బదులుగా విష్ణు వెళ్లుంటే బాగుండేది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.