https://oktelugu.com/

AP IPS Officer: ఏపీలో మరో సీనియర్ ఐపీఎస్ పై వేటు.. కారణం అదే

వైసిపి హయాంలో అడ్డగోలుగా వ్యవహరించారు కొందరు అధికారులు. నాటి ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులు ఒత్తారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 4, 2024 / 10:07 AM IST

    AP IPS Officer

    Follow us on

    AP IPS Officer: ఏపీలో కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. వైసిపి ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులపై కూటమి సర్కార్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలకు ఉపక్రమిస్తుంది. అందులో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారిపై చర్యలు తీసుకుంది. ఇప్పటికే ముంబై నటి జెత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు మరో సీనియర్ అధికారిపై వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వైసిపి హయాంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అనుసరించి నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారన్న విమర్శ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ పై ఉంది. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గా, సిఐడి విభాగాధిపతిగా సంజయ్ పని చేశారు. ఆ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్నది ఆయనపై ఉన్న అభియోగం. దానిని కారణంగా చూపుతూ ఆయనపై సస్పెండ్ వేటు పడింది. అనుమతి లేకుండా విజయవాడ నగరాన్ని విడిచి వెళ్లొద్దని కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

    * భారీగా నిధులు గోల్మాల్
    వైసిపి హయాంలో సిఐడి విభాగాధిపతిగా సంజయ్ వ్యవహరించారు. ఆయన వ్యవహార శైలి పై అనేక రకాల విమర్శలు ఉన్నాయి. అంతకుముందు అగ్నిమాపక శాఖ ఈజీగా కూడా పని చేశారు. ఆ సమయంలో భారీగా నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు ఉన్నాయి. దానిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కొనసాగింది. అనేక రకాల అవకతవకలు బయటపడ్డాయి. దీంతో విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం సంజయ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఒక్క అగ్నిమాపక శాఖలోనే కాదు.. సిఐడి విభాగాధిపతిగా కూడా అనేక రకాల అవినీతి చేశారని ఆయన చుట్టూ ఆరోపణలు ఉన్నాయి.

    * సదస్సుల పేరిట నిధుల దుర్వినియోగం
    సంజయ్ సిఐడి చీఫ్ గా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం పై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించారు. వీటి కోసం షార్ట్ టెండర్లు పిలిచారు. మొత్తం మూడు సంస్థలు ఈ టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నాయి. ఒక సంస్థకు ఆ బాధ్యతలను అప్పగించారు. అయితే చెల్లింపుల విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై విజిలెన్స్ లోతైన విచారణ చేసింది. భారీగా నిధులు గోల్మాల్ జరిగినట్లు సమాచారం. అయితే ఈ అక్రమాలకు ప్రధాన బాధ్యుడు సంజయ్ అని విజిలెన్స్ విచారణలో తేలింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.