Nagamanikantha : నాగ మణికంఠ డే వన్ నుండి ప్రేక్షకులను ఆకర్షించిన కంటెస్టెంట్. ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో నాగ మణికంఠ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. తల్లి వేరే పెళ్లి చేసుకుంది. పెంపుడు తండ్రి కారణంగా అవమానాలు, వేధింపులు ఎదురయ్యాయి. తల్లి మరణిస్తే దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేక అడుక్కున్నాను, అని కన్నీరు పెట్టుకున్నాడు. నాగ మణికంఠ కామెంట్స్ తో కొంత సింపతీ ఏర్పడింది.
పల్లవి ప్రశాంత్ ని ఫాలో అవుతున్న నాగ మణికంఠ ఫస్ట్ వీక్ లోనే సింపతీ గేమ్ స్టార్ట్ చేశాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కాగా నాగ మణికంఠ కామెంట్స్ ని ఆయన సిస్టర్ ఖండించడం విశేషం. తండ్రి తమకు కావాల్సినవన్నీ ఇచ్చాడు. నాగ మణికంఠను వేధింపులకు గురి చేశాడన్న వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. అలాగే తల్లికి కనీసం దహన సంస్కారాలు నిర్వహించలేని స్థితిలో మేము లేమని ఆమె అన్నారు.
పదే పదే నాగ మణికంఠ భార్య పిల్లల ప్రస్తావన తెచ్చేవాడు. టైటిల్ కొడితేనే నాకు నా ఫ్యామిలీ దక్కుతుంది. అత్తమామల ఇంట్లో గౌరవం ఉంటుందని ఏడ్చేవాడు. ఇంతటి ఎమోషనల్ డైలాగ్స్ కొట్టిన నాగ మణికంఠ ఎలిమినేట్ కాకుండానే షో నుండి తప్పుకున్నాడు. ఆడియన్స్ ఓట్ల ప్రకారం గౌతమ్ చివరి స్థానంలో ఉన్నాడు. గౌతమ్ కి బదులు తాను ఇంటి నుండి వెళ్లిపోతానని హోస్ట్ నాగార్జునను నాగ మణికంఠ రిక్వెస్ట్ చేశాడు. ఆరోగ్యం సహకరించడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు.
కాగా బయట నాగ మణికంఠకు ఘన స్వాగతం లభించింది. తన ఏరియాలో కార్ ర్యాలీ చేశారు. అభిమానులు, మీడియా ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. అనంతరం నాగ మణికంఠ మీడియాతో మాట్లాడాడు. టైటిల్ కొడతానంటూ ఏడు వారాలకే ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు మీ భార్య రియాక్షన్ ఏమిటీ? ఆమె మిమ్మల్ని కలవడానికి వచ్చారా? అని అడగ్గా…
పాపతో ఇంత దూరం రాలేదు కదా. నేను బిగ్ బాస్ హౌస్లో ఉండగా ప్రియ నాకు లెటర్ రాసింది. అది నా ఫస్ట్ లవ్ లెటర్. ఆ లెటర్ నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని నాగ మణికంఠ అన్నాడు. కాబట్టి నాగ మణికంఠ ఇంకా తన భార్యను కలవలేదు. అయితే హౌస్ కి తన కోసం లెటర్ పంపింది. దాన్ని బట్టి చూస్తే నాగ మణికంఠ మీద ఆమెకు ప్రేమ ఉంది. అయితే ఎలిమినేట్ కావడం వలన ఆమె ఎలా ఫీల్ అవుతున్నారనేది తెలియదు. ప్రియ-నాగ మణికంఠ మధ్య మనస్పర్థలు ఉన్నాయనేది నిజం. వారి వైవాహిక జీవితం ఎలా సాగనుందనేది చూడాలి.
Web Title: What did his wife priya do to nagamanikantha who came home after self elimination
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com