https://oktelugu.com/

AVS’s daughter Shanti : నా కాలేయం నాన్నకు ఇచ్ఛా…ఆపరేషన్ తర్వాత కోమాలోకి…కమెడియన్ ఏవీఎస్ గురించి ఆయన కూతురు చెప్పిన విషయాలు..

ఇంటర్వ్యూలో ఏవీఎస్ కూతురు శాంతి తన తండ్రి ఏవీఎస్ గురించి పలు విషయాలను పంచుకున్నారు. మా నాన్న 57 ఏళ్ల వయసులో చనిపోయారు. మా అమ్మ 62 ఏళ్ల వయసులో చనిపోయింది. నిరంతరం షూటింగ్లో ఉండి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్లనే మా నాన్న ఆరోగ్యం క్షీణించింది. కానీ బయట వాళ్ళు మాత్రం మందు తాగడం వల్లనే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడంటూ అపోహ పడ్డారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 6, 2025 / 01:30 PM IST

    AVS's daughter Shanti

    Follow us on

    AVS’s daughter Shanti : తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న కమెడియన్లలో ఏవీఎస్ కూడా ఒకరు. టాలీవుడ్ లో ఏవీఎస్ ఎన్నో సినిమాలలో కమెడియన్ గా మెప్పించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఏవీఎస్ పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. కెరీర్ ప్రారంభంలో రంగస్థలం కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నారు ఏవీఎస్. ఆ తర్వాత ఏవీఎస్ తెలుగులో మిస్టర్ పెళ్ళాం అనే సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. తన మొదటి సినిమా తోనే ఏవీఎస్ నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఏవీఎస్ మాయలోడు, శుభలగ్నం, మావిడాకులు, యమలీల, ఘటోత్కచుడు, ఇంద్ర, యమగోల మళ్ళీ మొదలైంది ఇలా పలు సినిమాలలో తన కామెడీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తన కెరీర్లో ఏవీఎస్ 500లకు పైగా సినిమాలలో కమీడియన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. 2013 సంవత్సరంలో ఏవీఎస్ మరణించారు. అయితే తాజాగా ఏవీఎస్ కూతురు శాంతి మరియు అల్లుడు చింటూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో ఏవీఎస్ కూతురు శాంతి తన తండ్రి ఏవీఎస్ గురించి పలు విషయాలను పంచుకున్నారు. మా నాన్న 57 ఏళ్ల వయసులో చనిపోయారు. మా అమ్మ 62 ఏళ్ల వయసులో చనిపోయింది. నిరంతరం షూటింగ్లో ఉండి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్లనే మా నాన్న ఆరోగ్యం క్షీణించింది. కానీ బయట వాళ్ళు మాత్రం మందు తాగడం వల్లనే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడంటూ అపోహ పడ్డారు. మాది బ్రాహ్మణ కుటుంబం. మా నాన్నకు అస్సలు మందు అలవాటే లేదు. ఆయన గుడ్డు కూడా తినేవారు కాదు. కేక్ లో గుడ్డు ఉంటుందని కేక్ ను కూడా ముట్టుకునేవారు కాదు. సోడానే తాగలేకపోయేవారు అలాంటిది మందు జోలికి వెళ్ళిందే లేదు. కానీ 2008వ సంవత్సరంలో మా నాన్న కాలేయం పాడైపోయింది.

    మా నాన్నను పరీక్షించిన వైద్యులు కాలేయం మార్పిడి చేయాలన్నారు. నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా లావుగా ఉండడం వలన నా కాలేయం సెట్ అవ్వదు అన్నారు. మా నాన్న ఒక శాతం మాత్రమే బతికే ఛాన్స్ ఉందన్నారు. కాలేయం కోసం దాత దొరకాలంటే ఏడాది పడుతుందన్నారు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలోనే మా నాన్న జ్ఞాపక శక్తిని కూడా కోల్పోయారు. ఆయనకు నా పేరు మాత్రమే గుర్తుంది. ఇక 20 రోజుల్లో నాన్నకు కాలేయం మార్పిడి చేయాలన్నారు. ఇక అంత తక్కువ సమయంలో దాతలు దొరికే అవకాశం లేదని నేనే కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యాను. నాకు ఆరోగ్య పరీక్షలు చేసి అంత బాగుందని వైద్యులు చెప్పారు. కానీ భవిష్యత్తులో నాకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం వస్తాయేమో అని భావించి నాన్న ఒప్పుకోలేదు. అప్పుడు నా భర్త దగ్గరుండి నాన్నను ఇందుకు ఒప్పించాడు. నాన్న ఓకే చెప్పడానికి వారం రోజులు పట్టింది. 60 శాతం నా కాలేయాన్ని దానం చేశాను.

    ఆ తర్వాత ఆరు నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. ఆపరేషన్ తర్వాత శరీరంలో రక్త కణాలు తగ్గిపోవడంతో ఒక్కో రోజంతా నేను అపస్మారక స్థితి లో ఉన్నాను. ఆపరేషన్ తర్వాత ఆరు నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాన్నను సూచించారు. కానీ నాన్న వినకుండా ఆపరేషన్ అయినా రెండు నెలలకే పనిలో పడిపోయాడు. కాలేయం పెరగడం కోసం దాదాపు నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చిన తర్వాత పిల్లలను ప్లాన్ చేసుకున్నాము. మొదట్లో నాకు పిల్లలు పుడతారో లేదో అని నాన్న భయపడ్డాడు. కానీ ఒక పాప పుట్టగానే నాన్న చాలా ఆనందపడ్డాడు. నాన్నకు ఆపరేషన్ అయినా ఆరేళ్లకు పరిస్థితి విషమించి నా చేతుల్లోనే రక్తం కక్కుకొని చనిపోయాడు. అప్పట్లో ఆపరేషన్ కి రూ. 65 లక్షలు ఖర్చయింది. ఆ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా సపోర్ట్ చేసింది అంటూ శాంతి చెప్పుకొచ్చారు.