Pakistan: పాముకు పాలు పోసి పెంచినా అది విషమే కక్కుతుంది. ఉగ్రవాదులకు ఎంత అనుకూలంగా వ్యవహరించినా.. చివరకు వారు దాడులకే తెగబడతారు. ఉగ్రవాదంతో ఎప్పటికీ ముప్పే.. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు ఎప్పుడో గుర్తించాయి. కానీ, పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులకు, ఉగ్రవాద దేశాలకు కొమ్ముకాస్తోంది. ఇప్పుడు అదే ఉగ్రవాదం ఆ దేశానికి సవాల్ విసురుతోంది. విధ్వంసానికి పాల్పడుతోంది. ఆత్మాహుతి దాడులు చేస్తోంది. తాజాగా పాకిస్తాన్‌లో బెలూచిస్తాన్‌లో దాడి చేసింది. ఈ ఘటనలో భారీగా సైనికులు దుర్మరణం చెందారు.
ఏం జరిగిందంటే..
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థ బలోచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ) బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురే సైనికులు మరణించారని ఇస్తామాబాద్ చెంతుండగా బీఎల్‌ఏ మాత్రం తాము 47 మంది సైనికులను మట్టు పెట్టామని ప్రకటించింది. మరో 30 మంది గాపడినట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ దాడికి సంబందించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడి శనివారం(జనవరి 5న) తుర్పత్ వద్ద జరిగింది. పాక్ సైనిక కాన్వాయ్‌పై బీఎల్‌ఏలోని మాజిద్ బ్రిగేడ్‌కు చెందిన ఆత్మాహుతి దళ యూనిట్ నిర్వహించినట్లు ప్రకటించింది. బీఎస్‌ఏ ప్రతినిధి జైనాద్ బోలచ్ మాట్లాడుతూ »ñ హ్మాన్ ఏరియా తుర్బత్‌కు 8 కిలోమీటర్ల దూరంలో సాయంత్రం 5:45 గంటలకు ఈ దాడి చేసినట్లు వెల్లడించారు. ఐదు బస్సులు సహా ఏడు సైనిక వాహనాలతో వస్తున్న కాన్వాయ్‌పై దాడిచేసినట్లు జైనాద్ తెలిపారు. ఈ వాహనాలు కరాచీ నుంచి తిర్బత్‌లని ఫ్రాంటియర్ కోర్ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్నాయని పేర్కొన్నారు.
భారీగా నష్టం…
బీఎల్‌ఏ ఆత్మాహుతి దాడిలో సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనాల్లో ఎంఐ 309, ఎఫ్‌సీ 117, ఎఫ్‌సీఐయూ, శ్రీఫ్326 వింగ్ ఎఫ్‌సీ 81 వింగ్, రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్, ప్రస్తుత పోలీస్ అధికారి జోహైబ్ మోహసిన్ ఉన్నారు. దాడిలో ఒక బస్సు పూర్తిగా శ్వసంమైంది. ఇతర వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక సైనిక వాహనం కూడా దెబ్బతిన్నట్లు వెల్లడించింది. ఇక తమ ఇంటెలిజెన్స వింగ్ అయిన జిరాబ్ సమన్వయం చేయంతో దీనిని నిర్వహించినట్లు తెలిపారు. తమ దళానికి చెందిన బహర్ అలీ ఈ దాడి చేసినట్లు తెలిపారు. అతడు 2017లో బీఎల్‌ఏలో చేరగా, 2022 నుంచి మాజిద్ బ్రిగెడ్ కోసం పనిచేస్తున్నట్లు పేర్కొంది.
వాహనాలు ఇవ్వొద్దని…
స్థానిక రవాణా చేసే వ్యాపారులు పాక్‌సైన్యానికి ఎలాంటి వాహనాలు ఇవ్వొద్దని బీఎల్‌ఏ హెచ్చరించింది. ఎవరైనా ఇస్తే దాడులు చేస్తామని బీఎన్‌ఏ ప్రతిని«ధి స్పష్టం చేశారు. తాము పాక్ సైన్యం, ప్రభుత్వ ఏజెంట్లకు బలోచిస్తాన్ హైవేలను అసురక్షితంగా మారుస్తామని పేర్కొన్నారు. మరోవైపు పాక్ రక్షణ వర్గాలు దీనికి సంబంధించిన తమవద్ద పరిమిత సమాచారం మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు.