ETV- Jabardasth: చేతులారా వాళ్లను వదులుకుంటున్నారా? ఈటీవీ వెనుకబడడానికి కారణాలేంటి?

ETV- Jabardasth: బంగారు బాతు రోజుకు ఒకే గుడ్డు పెడుతుంది. ఒకేసారి అన్ని గుడ్లు పొందాలనుకుని బాతును కొస్తే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం ఈ పరిస్థితిని ఈటీవీ ఎదుర్కొంటుంది. ఒకప్పుడు తిరుగులేని ధారావాహికలు, అలనాటి పౌరాణిక చిత్రాలతో ఈటీవీ రారాజుగా వెలిగేది. జెమిని రాకతో రెండో స్థానానికి వెళ్ళింది. మాటీవీ రాకతో మూడో స్థానానికి వెళ్ళింది. జీతెలుగు రాకతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఆదుకున్న మల్లెమాల పడిపోతున్న రేటింగ్, జనాధారణ కోల్పోతున్న ధారావాహికలు.. ఈ సమయంలో […]

Written By: K.R, Updated On : June 29, 2022 4:47 pm
Follow us on

ETV- Jabardasth: బంగారు బాతు రోజుకు ఒకే గుడ్డు పెడుతుంది. ఒకేసారి అన్ని గుడ్లు పొందాలనుకుని బాతును కొస్తే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం ఈ పరిస్థితిని ఈటీవీ ఎదుర్కొంటుంది. ఒకప్పుడు తిరుగులేని ధారావాహికలు, అలనాటి పౌరాణిక చిత్రాలతో ఈటీవీ రారాజుగా వెలిగేది. జెమిని రాకతో రెండో స్థానానికి వెళ్ళింది. మాటీవీ రాకతో మూడో స్థానానికి వెళ్ళింది. జీతెలుగు రాకతో నాలుగో స్థానానికి పరిమితమైంది.

ETV- Jabardasth

ఆదుకున్న మల్లెమాల

పడిపోతున్న రేటింగ్, జనాధారణ కోల్పోతున్న ధారావాహికలు.. ఈ సమయంలో ఈ టీవీ కి సంజీవనిగా దొరికింది మల్లెమాల. అదే సమయంలో ఈటీవీ తనకున్న అన్ని చానళ్ళను( తెలుగు మినహా) రిలయన్స్ నేతృత్వంలోని నెట్వర్క్ 18 కు విక్రయించింది. మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి, ఈటీవీ బాపినీడు ని కలవడం.. ఒప్పందం జరగడం అన్నీ చకా చకా జరిగిపోయాయి. అంజి సినిమా ద్వారా వచ్చిన నష్టాలను అరుంధతి సినిమాతో పూడ్చుకున్న శ్యాం ప్రసాద్ రెడ్డి మిగతా డబ్బులను ఈటీవీలో పెట్టుబడులుగా పెట్టారు. అదే సమయంలో నితిన్, భరత్ దర్శక ద్వయంతో హిందీ లో పాపులర్ అయిన కపిల్ శర్మ కామెడీ షోకి కొన్ని మార్పులు చేర్పులు చేసి జబర్దస్త్ కు శ్రీకారం చుట్టారు. మెగా బ్రదర్ నాగబాబు, వెటరన్ హీరోయిన్ రోజా ను న్యాయ నిర్ణేతలుగా నియమించుకుని షోను మొదలుపెట్టారు. అప్పుడే సాక్షి టీవీలో న్యూస్ యాంకర్ గా మానేసిన అనసూయ ను హోస్ట్ గా పెట్టుకున్నారు. చలాకి చంటి, అదిరే అభి, ధనరాజ్, గాలి సుధీర్, హైపర్ ఆది వంటి వారితో స్కిట్లు చేయిస్తూ తిరుగులేని ప్రజాధరణ పొందారు. అంతేనా దక్షిణాది టీవీ చరిత్రలోనే అత్యధిక టీఆర్పీలు సాధించే కామెడీ షో గా జబర్దస్త్ను నిలబెట్టారు. పండగల సమయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి వారేవా అనిపించుకున్నారు. మిగతా ఛానెళ్లు ఈ పంథాను అనుసరించి చేతులు కాల్చుకున్నాయి.

Also Read: Rashmika Mandanna: షాకింగ్: భారీగా పెంచేసిన రష్మిక మందన్నా

అనుకోని బ్రేక్

జబర్దస్త్ కామెడీ షో కు భరత్, నితిన్ దర్శకత్వం మాత్రమే వహించేవారు. మిగతా పెత్తనమంతా నాగబాబుదే. ఆయన సామాజిక వర్గం వారికే పెద్ద పీట వేస్తున్నారనే ఆరోపణలు రావడంతో నాగబాబు, శ్యాం ప్రసాద్ రెడ్డి, బాపినీడు మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో నాగబాబు షో నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆయన బాటనే చమ్మక్ చంద్ర , నితిన్, భరత్ ఆశ్రయించడంతో జీ తెలుగులో అదిరింది పురుడు పోసుకుంది. జబర్దస్త్ కు మక్కి మక్కి దించడంతో రేటింగ్స్ రాలేదు. పైగా గల్లీ బాయ్స్ వేసిన స్కిట్ ఏపీ సీఎం జగన్ ఆగ్రహానికి గురయింది. తర్వాత షో నే మూత పడింది.

రోజా పెత్తనం

బిగ్బాస్ లో అవకాశం రావడంతో అవినాష్ షో నుంచి వెళ్లిపోయాడు. మల్లెమాల తో బాండ్ ఉండడంతో వారికి నగదు ఇచ్చేసి తెగదెంపులు చేసుకున్నాడు. ఇటు నాగబాబు లేడు. అటు నితిన్, భరత్ రాం రాం అన్నారు. ఫలితంగా పెత్తనం రోజాకు దక్కింది. రెడ్డి సామాజిక వర్గం కూడా ఆమెకు కలిసి వచ్చింది. ఇక అప్పటి నుంచి రోజా పైత్యం పెరిగింది. హైపర్ ఆది లాంటి వారి నోటికి అడ్డు లేకుండా పోయింది. ఫలితంగా పక్కా అడాల్డ్ షో గా పేరు గడించింది. పోనీ ఆ షో అయినా నడుస్తోందా అంటే అదీ లేదు. మంత్రి పదవి రావడంతో రోజా వెళ్ళిపోయింది. సుధీర్, గెటప్ శ్రీను వెళ్ళిపోయారు.

Sudheer, Getup Srinu, Roja

ఆది కనిపించడం మానేశాడు. పేరుకు సినిమా అవకాశాల వల్ల వాళ్ళు మానేశారని చెబుతున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయి. శ్యాం ప్రసాద్ రెడ్డి కూతురు మితిమీరిన జోక్యం వల్ల జబర్దస్తు తన లయను కోల్పోయింది. ఇది మొదలు ఢీ వరకు పతనం సాగుతోంది. నానాటికీ పడిపోతున్న రేటింగ్స్ ఈటీవీ దీనత్వాన్ని కళ్ళకి గడుతున్నాయి. కొత్త రక్తాన్ని అంతగా ప్రోత్సహించక పోవడం, దర్శకుల సృజనాత్మక లేమితో షో రక్తి కట్టడం లేదు. దీనికి తోడు యాంకర్ గా అనసూయ వైదొలగడంతో షో కు ఉన్న గ్లామర్ పోయింది. తెలుగు జర్నలిజంలో ఈనాడు ఒక ట్రెండ్ సెట్టర్. ప్రమాణాల విషయంలో ఈనాడు జర్నలిజం కాలేజీది శిఖర స్థానం. అందులో తర్ఫీదు పొందిన వారు నాలుగేళ్లు బాండ్ రాయాలి. ఒకవేళ మానేస్తే ఈనాడు కు డబ్బులు కట్టాలి. ఇదే విధానాన్ని జబర్దస్త్ కు అంటగట్టడంతో మేలిమి కళాకారులు బయటకి వెళ్లారు. అచ్చం ఈనాడు నుంచి బయటకి వెళ్ళిన జర్నలిస్టుల్లా. ఇంత జరుగుతున్నా బాపినీడు, శ్యాం ప్రసాద్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇన్ని ప్రతికూలతల మధ్య ప్రైమ్ టైం ఈటీవీ న్యూస్ రామోజీరావు కి ఒక సాంత్వన. మిగతా వాటి విషయాల్లో తీరని వేదన.

Also Read:Chiranjeevi: ప్రభాస్ వదులుకున్న సినిమాని చెయ్యబోతున్న మెగాస్టార్ చిరంజీవి

Tags