https://oktelugu.com/

Rashmika Mandanna: షాకింగ్: భారీగా పెంచేసిన రష్మిక మందన్నా

Rashmika Mandanna: తెలుగు చిత్ర పరిశ్రమలో రష్మిక మందన్నా టాప్ పొజిషన్‌లో దూసుకుపోతోంది. ఈ స్లాట్‌లో ఆమెకు ఆల్టర్నేట్ లేదు. కాబట్టి, తన ప్రతి సినిమాకు పారితోషికం పెంచుకుంటూ పోతోంది రష్మిక. ఈ ప్రక్రియలో భాగంగా తాజాగా మరోసారి పారితోషికాన్ని సవరించింది. ఇప్పుడు ఈ బ్యూటీ 4 కోట్ల రూపాయలకు చేరుకుందని టాక్. తాజా సమాచారం ప్రకారం.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న జనగణమన సినిమా కోసం రష్మిక మందన్నాను మరో హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : June 29, 2022 / 04:23 PM IST
    Follow us on

    Rashmika Mandanna: తెలుగు చిత్ర పరిశ్రమలో రష్మిక మందన్నా టాప్ పొజిషన్‌లో దూసుకుపోతోంది. ఈ స్లాట్‌లో ఆమెకు ఆల్టర్నేట్ లేదు. కాబట్టి, తన ప్రతి సినిమాకు పారితోషికం పెంచుకుంటూ పోతోంది రష్మిక. ఈ ప్రక్రియలో భాగంగా తాజాగా మరోసారి పారితోషికాన్ని సవరించింది. ఇప్పుడు ఈ బ్యూటీ 4 కోట్ల రూపాయలకు చేరుకుందని టాక్. తాజా సమాచారం ప్రకారం.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న జనగణమన సినిమా కోసం రష్మిక మందన్నాను మరో హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

    Rashmika Mandanna

    అయితే, ఆ సినిమాకు గానూ రష్మిక ఎంత డిమాండ్ చేసిందో తెలుసా ?, మొత్తం అక్షరాలా 4 కోట్లు. ఇందులో రష్మిక మందన్నా పారితోషికం రూ. 3.70 కోట్లు, కాగా ఆమె సిబ్బంది జీతాలు మరియు ఇతర ఖర్చుల కోసం 30 లక్షల రూపాయలు అన్నమాట. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఓ హీరోయిన్ అందుకున్న అత్యధిక పారితోషికం ఇదేనట.

    Also Read: Raashi Khanna: తిరుమలలో రాశీ ఖన్నా షాకింగ్ లుక్.. అలా ఎలా వెళ్ళింది ?

    రష్మిక మందన్నా చేతిలో మహేష్-త్రివిక్రమ్ సినిమా, కొరటాల – ఎన్టీఆర్ సినిమాలు కూడా ఉన్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాల్లో ఆమె ఉంటుందో లేదో క్లారిటీ లేదు. కాకపోతే, రష్మిక మందన్నాకు రెండు హిందీ ప్రాజెక్ట్‌ లు కూడా ఉన్నాయి. పైగా అమితాబ్ గుడ్ బై చిత్రంలో రష్మిక మందన్నా కీలక పాత్రలో కనిపించబోతుంది.

    Rashmika Mandanna

    ఈ క్రేజ్ ఇంకెంతో కాలం ఉండదు అని రష్మిక మందన్నాకు బాగాతెలుసు. పైగా టాప్ హీరోలందరితో ఒకసారి కలిసి నటించాక.. మళ్లీ వారితో హీరోయిన్ గా రిపీట్ అయ్యే అవకాశాలు అంతంత మాత్రమే. అందుకే రష్మిక మందన్నా, క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకునే పనిలో ఉంది. ఇటీవల ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది రష్మిక. అందుకే, ఆమెకు భారీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.

    ఇండస్ట్రీలో సింగిల్ హిట్ వస్తే.. లైఫ్ చాలా మారిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ల లైఫ్ ఓవర్ నైట్ లోనే చేంజ్ అయిపోతుంది. అయితే, ఒక్కోసారి ఒక్క హిట్ కూడా పడకపోయినా.. హీరోయిన్ లో మ్యాటర్ ఉంది అని టాక్ తెచ్చుకున్నా చాలు.. మూడు, నాలుగు సినిమాల ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. మొదట్లో రష్మిక మందన్నాకు అలాగే ఛాన్స్ లు వచ్చాయి.

    Also Read:Chiranjeevi: ప్రభాస్ వదులుకున్న సినిమాని చెయ్యబోతున్న మెగాస్టార్ చిరంజీవి

    Tags