NTR- Koratala Siva: అప్పట్లో కథా చర్చల కోసం అరకు లాంటి ప్రదేశాలకు వెళ్లేవారు. ఆ తర్వాత రిసార్టులకు మారారు. ఆ తర్వాత గోవాకు షిఫ్ట్ అయ్యారు. మధ్యలో పూరి జగన్నాధ్ పుణ్యమా అని బ్యాంకాక్ కూడా వచ్చి చేరింది. అలా స్టోరీ డిస్కషన్స్ కోసం దేశాలు దాటడం ఎప్పటి నుంచో వస్తున్న అనవాయితీ. ఇప్పుడీ కల్చర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివతో తన తర్వాత సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్.
ఐతే, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ జర్మనీలో స్టోరీ డిస్కషన్స్ పెట్టాడు. కొరటాలతో కలిసి స్టోరీ డిస్కషన్స్ కోసం ఎన్టీఆర్ జర్మనీ వెళ్ళాడు. ఎన్టీఆర్ మొదట ఫ్యామిలీతో జాలీగా గడిపేందుకు జర్మనీ వెళ్లాడు. అంతలో కొరటాల స్క్రిప్ట్ పూర్తి చేశాడు. ఎన్టీఆర్ ఫుల్ స్క్రిప్ట్ చెప్పడానికి కొరటాల కూడా జర్మనీ వెళ్లాడు. అక్కడే ఎన్టీఆర్ తో సినిమాకు సంబంధించి తుది చర్చలు జరిపాడు.
Also Read: ETV- Jabardasth: చేతులారా వాళ్లను వదులుకుంటున్నారా? ఈటీవీ వెనుకబడడానికి కారణాలేంటి?
ఇండియా వచ్చిన తర్వాత మళ్లీ టైమ్ వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో, కొరటాల అక్కడకు వెళ్లాడన్నమాట. కొరటాలతో పాటు మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్ కూడా జర్మనీ వెళ్లాడు. సినిమాలో ఎలాంటి సందర్భాల్లో పాటలు వస్తాయి, ఏ పాటకు ఏ కంపోజిషన్ అయితే బాగుంటుంది లాంటి అంశాల్ని కూడా ఎన్టీఆర్ తో చర్చించారు. ఇలా ఎన్టీఆర్ తో స్టోరీ డిస్కషన్ కోసం కొరటాల ఏకంగా జర్మనీ వరకూ వెళ్ళాడు.
ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివలో చాలా మార్పులు వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ గా మలచబోతున్నాడు. అందుకోసం.. హాలీవుడ్ యాక్షన్ టెక్నీషియన్స్ ను పెట్టుకుంటున్నాడు. మరి చూడాలి.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో.
Also Read:Rashmika Mandanna: షాకింగ్: భారీగా పెంచేసిన రష్మిక మందన్నా