https://oktelugu.com/

Game Changer: ‘గేమ్ చేంజర్’ లో ఆ సన్నివేశాలు సీఎం రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి తీసినవా..? శంకర్ ఇవ్వబోతున్న ట్విస్ట్ మామూలుగా లేదుగా!

రామ్ చరణ్ కాలేజీ స్టూడెంట్ గా, IAS అధికారిగా, రాజకీయ నాయకుడిగా, ఇలా మూడు రకాల పాత్రల్లో మనకి కనిపించబోతున్నాడు. ఆయన నటన శంకర్ దర్శకత్వం ని కూడా డామినేట్ చేసే విధంగా ఉంటుందట.

Written By:
  • Vicky
  • , Updated On : November 20, 2024 / 05:20 PM IST

    Game Changer Movie

    Follow us on

    Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తారీఖున సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి అభిమానుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూసాము. ఒక్క సినిమాలో మూడు రకాల వేరియేషన్స్ తో రామ్ చరణ్ కనిపించడం ఆడియన్స్ ని చాలా థ్రిల్ కి గురి చేసింది. సినిమా విడుదల కోసం జనవరి 10 వరకు కూడా ఆగలేకపోతున్నారు. అంతలా వారిలో ఆసక్తిని రేపింది ఈ టీజర్. ఇందులో రామ్ చరణ్ కాలేజీ స్టూడెంట్ గా, IAS అధికారిగా, రాజకీయ నాయకుడిగా, ఇలా మూడు రకాల పాత్రల్లో మనకి కనిపించబోతున్నాడు. ఆయన నటన శంకర్ దర్శకత్వం ని కూడా డామినేట్ చేసే విధంగా ఉంటుందట.

    అయితే ఈ సినిమాలో ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘హైడ్రా’ ప్రాజెక్ట్ కి పోలిన అనేక సన్నివేశాలు ఉంటాయట. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన అవినీతి రాజకీయ నాయకుల భరతం పడుతూ, వాళ్ళ బిల్డింగ్స్ ని కూల్చివేసే సన్నివేశాలు శంకర్ చాలా ఆసక్తి కరంగా తీసాడట. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ లో చేపడుతున్న ఈ కార్యక్రమం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున కట్టుకున్న N కన్వెషన్ హాల్ ని కూడా అక్రమ కట్టడాల్లో చేర్చి కూల్చివేసిన ఘటన ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే ‘గేమ్ చేంజర్’ లో ఈ సన్నివేశాలను సీఎం రేవంత్ రెడ్డి ని కాపీ కొట్టి తీయలేదు. ఆయన ఈ కార్యక్రమం తలపెట్టకముందే ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. టీజర్ లో ఒక అద్దాల మేడ పేక మేడలాగా కూలిపోయే షాట్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ షాట్ హైడ్రా ప్రాజెక్ట్ ని పోలి ఉన్నదే.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రొమోషన్స్ వచ్చే నెల మొదటి వారం నుండి గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారు మేకర్స్. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ని కూడా సిద్ధం చేశారట. తిరుపతి లో గ్రాండ్ గా నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలోని ప్రధాన తారాగణం పై పలు కీలక సన్నివేశాలను విజయవాడ లో షూటింగ్ చేస్తున్నాడట డైరెక్టర్ శంకర్. వచ్చే నెల మొదటి వారం లోపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో సహా పూర్తి చేసి, మొదటి కాపీ ని సిద్ధంగా ఉంచనున్నారట. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వచ్చే నెలలోనే ప్రారంభించబోతున్నట్టు సమాచారం.